• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA TO WITNESS RAIN TILL NEXT THREE DAYS PREDICTS HYDERABAD WEATHER CENTRE BA

Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబరు 20 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

  • Share this:
    తూర్పు-పశ్చిమ shear zone Lat.16.0 deg.N వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర కోస్తా ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రేపు (సెప్టెంబరు 20 వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు