హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ అడవులపై డ్రోన్ల చక్కర్లు.. అటవీ శాఖ టార్గెట్ ఇదే

తెలంగాణ అడవులపై డ్రోన్ల చక్కర్లు.. అటవీ శాఖ టార్గెట్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డ్రోన్‌లతో అడవుల పెంపకంపైనా దృష్టిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో ట్యాగింగ్ చేసిన డ్రోన్లతో తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో విత్తనాలను చల్లబోతున్నారు.

తెలంగాణ అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవులపై ఇక నుంచి డ్రోన్లతో నిఘా పెట్టాలని నిర్ణయించింది. అటవీశాఖ అధికారుల సెక్యూరిటీ ఉన్నప్పటికీ, స్మగ్లర్లు వాళ్ల కళ్లుగప్పి విలువైన అటవీ సందపను దోచుకెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి చెక్ పెట్టేందుకు డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పలు గ్రామాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిఘా కేంద్రీకరించారు. టేకు చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎక్కల ఎలాంటి కదలికలు జరిగినా తమకు సమాచరం వస్తుందని వెల్లడించారు.

అంతేకాదు డ్రోన్‌లతో అడవుల పెంపకంపైనా దృష్టిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో ట్యాగింగ్ చేసిన డ్రోన్లతో తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో విత్తనాలను చల్లబోతున్నారు. రోజుకు సుమారు లక్ష విత్తనాలు చల్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పెద్ద మొత్తంలో సీడ్ బాల్స్ తయారు చేసి.. వర్షాకాలంలో డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లబోతున్నారు. హరితహారానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. తద్వారా అడవుల్లో వృక్ష సంపదను పెంచాలని భావిస్తోంది.

First published:

Tags: Haritha haram, Telangana

ఉత్తమ కథలు