తెలంగాణ వాసులకు హెచ్చరిక. ఈ సంవత్సరం వేసవికాలం మరింత వేడిగా ఉండబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే మొదటి వారంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. అంటే, మరో వారం రోజులే ఉందన్నమాట. మే మొదటి వారంలో తెలంగాణలోని పలుచోట్ల 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 31 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరుగుతున్నాయని ఐఎండీ హైదరాబద్ డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. సాధారణంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగినప్పుడు వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రత 43.3 డిగ్రీలు నమోదైంది. అది కూడా ఎప్పుడో ఏప్రిల్ 30, 1973న. ఇప్పటికే కరోనా వైరస్ భయంతో ప్రజలు అల్లాడుతుంటే, ఇప్పుడు వడగాల్పులు కూడా ప్రజలకు మరో ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.