• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA THREE PEOPLE DIED BY THUNDERSTORMS IN YADADRI BHUVANAGIRI DISTRICT SU

Telangana: తెలంగాణలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతి.. ఓ చోట దంపతుల జంట.. మరోచోట ఒక్కరు..

Telangana: తెలంగాణలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతి.. ఓ చోట దంపతుల జంట.. మరోచోట ఒక్కరు..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతిచెందారు.

  • Share this:
    తెలంగాణలో సోమవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీచాయి. అయితే యదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృతిచెందారు. చౌటుప్పల్‌ మండలం లింగోజీగూడెంలో పిడుగుపడి కరుణాకర్‌రెడ్డి,వీణమ్మ దంపతులు మృతి చెందార. మరోవైపు బొమ్మల రామారం మండలంలో మర్యాలలో పిడుగుపాటుకు రాములు అనే వ్యక్తి మృతిచెందారు. ఇలా పిడుగుపాట్లకు ముగ్గురి ప్రాణాలు బలి అయ్యాయి. ఈ ఘటనలతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు హైదరాబాద్ నగరంలోకి కూడా సోమవారం పలుచోట్ల వర్షం కురిసింది. ఈసీఐఎల్‌, కాప్రా, మల్లాపూర్, నాచారం, సనత్‌నగర్‌, ఎస్సార్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి తదితర‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలిగింది.

    మరోవైపు సోమవారం ఉదయం నుంచి సంగారెడ్డి జిల్లాలో వాతారణం చల్లగాఉంది. మధ్యాహ్నం సమయంలో జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఇక, తెలంగాణలో ఈ నెల 14వ తేదీ వరకు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలోని ఒకటి, రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గాలి వేగం గంటకి 30 నుండి 40కి మీ ఉండవచ్చని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు