తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడిగింపు...విద్యార్థులకు గుడ్ న్యూస్..

ముందుగా ప్రకటించిన ప్రకారం ఫీజు చెల్లించడానికి అక్టోబరు 29 చివరితేదీ కాగా.. నవంబరు 7 వరకు పొడిగించారు. అలాగే లేటు ఫీజుతో గడువును కూడా పెంచారు.

news18-telugu
Updated: October 21, 2019, 10:45 PM IST
తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడిగింపు...విద్యార్థులకు గుడ్ న్యూస్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను అధికారులు పొడిగించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఫీజు చెల్లించడానికి అక్టోబరు 29 చివరితేదీ కాగా.. నవంబరు 7 వరకు పొడిగించారు. అలాగే లేటు ఫీజుతో గడువును కూడా పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టులు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు మాత్రమే రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆలస్య రుసుముతో కూడా ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబరు 23 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబరు 9 వరకు, రూ.500 లేట్ ఫీజుతో డిసెంబరు 23 వరకు అవకాశం కల్పించారు.

అయితే పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు కుటుంబ వార్షికాదాయం ఉన్న విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దీని కోసం ఇన్ కం సర్టిఫికేట్ సమర్పించాలి.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading