ఆన్‌లైన్‌ క్లాసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ఆన్‌లైన్ క్లాసుల వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగతోందని విచారణ సందర్భంగా పిటిషనర్ వాదించారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత అందరికీ ఉంటుందా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

news18-telugu
Updated: July 1, 2020, 4:32 PM IST
ఆన్‌లైన్‌ క్లాసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. 4 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో తెలియదు. ఐతే ప్రైవేట్ స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లలో పాఠాలు చెబుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులను నిషేధించాలని పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. ఆన్‌లైన్ క్లాసుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన పాలిసీని రూపొందించలేదని వ్యాఖ్యానించింది.

ఆన్‌లైన్ క్లాసుల వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగతోందని విచారణ సందర్భంగా పిటిషనర్ వాదించారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత అందరికీ ఉంటుందా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై డీఈవోలు చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఐతే దీనిపై స్పష్టమైన పాలసీని రూపొందించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఆన్‌లైన్ క్లాసులపై ఎల్లుండి లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
First published: July 1, 2020, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading