హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణ టీడీపీ కీలక నిర్ణయం.. అక్కడ పోటీకి సై.. ఎవరికి లాభం ?.. ఎవరికి నష్టం ?

Telangana: తెలంగాణ టీడీపీ కీలక నిర్ణయం.. అక్కడ పోటీకి సై.. ఎవరికి లాభం ?.. ఎవరికి నష్టం ?

Nagarjuna Sagar By Election: టీడీపీ ఇక్కడి నుంచి గెలిచే అవకాశం లేకపోవడంతో.. ఆ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

  తెలంగాణలో జరగబోయే నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. బీజేపీ జోరు మీద ఉండటం.. అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుండటం.. నాగార్జునసాగర్ మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత సీటు కావడం వంటి అంశాలు నాగార్జునసాగర్‌లో హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ తరపున జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇక టీఆర్ఎస్, బీజేపీ తరపున ఎవరు పోటీ ఉంటారనేది మాత్రం తేలలేదు. ఈ రెండు పార్టీలు బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. దీంతో నాగార్జునసాగర్‌లో త్రిముఖ పోటీ ఖాయమనే టాక్ మొదలైంది.

  అయితే తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు టీడీపీ కూడా సిద్ధమైంది. టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉపఎన్నికపై క్లారిటీ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఏపీకి సరిహద్దు ప్రాంతం కావడంతో.. ఇక్కడ కచ్చితంగా తమకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వస్తాయని టీడీపీ భావిస్తోంది. గతంలోనూ ఇక్కడ తమ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారని టీడీపీ చెబుతోంది.

  ఈ నేపథ్యంలో తాజాగా ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. టీడీపీ ఇక్కడ నుంచి పోటీ చేయడం ఖాయం కావడంతో.. ఆ ఎఫెక్ట్ ఏ పార్టీపై ఎక్కువగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ ఇక్కడి నుంచి గెలిచే అవకాశం లేకపోవడంతో.. ఆ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నాగార్జునసాగర్ బరిలో నిలవాలని నిర్ణయించుకున్న టీడీపీ.. ఇక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  First published:

  Tags: Nagarjuna Sagar By-election, Telangana, TTDP

  ఉత్తమ కథలు