హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ఆరోగ్య సూచికలో తెలంగాణ టాప్ ర్యాంక్.. ఉత్తరాది రాష్ట్రం లాస్ట్...!

Telangana : ఆరోగ్య సూచికలో తెలంగాణ టాప్ ర్యాంక్.. ఉత్తరాది రాష్ట్రం లాస్ట్...!

health index

health index

Telangana : నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య నివేదికలో తెలంగాణ రాష్ట్రం టాప్ ర్యాంకులో నిలిచింది. దేశంలోని మొత్తం రాష్ట్రంలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో కేరళ నిలవగా రెండవ స్థానంలో తమిళనాడు నిలించింది.

ఆరోగ్య సూచికలో తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరంతో పోలిస్తే మరో అడుగు ముందుకు వేసింది. దీంతో 2019-20 సంవత్సరానికి గాను మరో ర్యాంకు సాధించి టాప్‌లో నిలిచింది. కాగా నేడు నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిని విడుదల చేసింది. 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కాగా 2018-19 సంవత్సరానికి గానూ తెలంగాణ 4వ స్థానంలో నిల‌వ‌గా, 2019-20 ఏడాదిలో మూడో స్థానానికి చేరింది.

రాష్ట్రాల వైద్య పురోగ‌తిపై 2019-20 ఏడాదికి సంబంధించిన 4వ హెల్త్ ఇండెక్స్ రిపోర్టును నీతి ఆయోగ్ సోమ‌వారం విడుద‌ల చేసింది. కేర‌ళ ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో, మూడవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం, కాగా నాలుగో స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నిలిచింది. ఇక వైద్య వ‌స‌తుల్లో వ‌రుస‌గా 4వ సారి కేర‌ళ అగ్ర‌స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో ఢిల్లీ, జ‌మ్మూక‌శ్మీర్ ముందున్నాయి. ప్రోత్సాహ‌క న‌మోదు రాష్ట్రాల్లో యూపీ అగ్ర‌భాగాన నిలిచింది.

Yadadri : యాదాద్రిని దర్శించుకున్న అఖండ టీం.. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమేనన్న హీరో


కాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను బలోపేతం చేస్తుండడంతోపాటు అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తూ, నాణ్య‌మైన వైద్యం అందించేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని అందుకే ఇలాంటీ ర్యాంకులు మూటగట్టుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Revanth reddy : రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్.. పోలీసులు, కార్యకర్తల తోపులాట.. చినిగిన చొక్కాలు


కాగా తెలంగాణలో ఒమిక్రాన్ నేపథ్యంలోనే మూడో డోసుకు సన్నహాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మూడు కోట్ల బూస్టర్ డోసులు ఇచ్చేందుకు సన్నద్దం అవుతుండడంతో తెలంగాణలో 60 సంవత్సరాలు పైబడిన వారికి మూడవ డోసును ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్రంలోని 25 లక్షల మందికి మూడవ డోసు ఇవ్వనున్నట్టు మాచారం. రెండవ డోసు వేసుకున్న నెలల గడిస్తే కాని, మూడో డోసు వేసేందుకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Niti Aayog, Telangana

ఉత్తమ కథలు