Home /News /telangana /

TELANGANA STATE INTELLIGENCE POLICE ENTERS INTO BJP NATIONAL EXECUTIVE MEETING BJP LEADERS SLAMS TRS CM KCR SK

BJP Meeting: బీజేపీ సమావేశాల్లో కలకలం.. రహస్యంగా ఫొటోలు..స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పనేంటి?

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

BJP Hyderabad Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పనేంటి? అనుమతి లేకుండా లోపలికి ఎలా వచ్చారు? రహస్యంగా ఫొటోలు ఎందుకు తీస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

    హైదరాబాద్ HICCలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (BJP National Executive Meeting) తీవ్ర కలకలం రేగింది. ఆదివారం ఉదయం తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులు (Telangana state intelligence Police) సమావేశ ప్రాంగణంలోకి రావడం దుమారం రేపింది. స్టేట్ ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాస్ రహస్యంగా ఫొటోలు తీశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎజెండా బుక్‌తో పాటు అక్కడున్న వారిని ఫొటోలు తీస్తుండగా బీజేపీ ఇంద్రసేనా రెడ్డి అడ్డుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన్ను సమావేశాల నుంచి బయటకు పంపించినట్లు పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పనేంటి? అనుమతి లేకుండా లోపలికి ఎలా వచ్చారు? రహస్యంగా ఫొటోలు ఎందుకు తీస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సమావేశంలో జరిగే చర్చ వివరాలను బయటకు చేరవేసేందుకే ఇంటెలిజెన్స్ పోలీసులు లోపలికి వచ్చారని బీజేపీ నేత ఇంద్రాసేనా రెడ్డి ఆరోపించారు.

    Congress MLA Jaggaredddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. రేపు కాంగ్రెస్​కు రాజీనామా

    బీజేపీ కార్యవర్గ సమావేశాల జరుగుతున్న హాల్‌లోకి ఎవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు? ఏం చేస్తున్నారో వీడియో తీసేందుకు స్టేట్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కాదు.. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను.. క్రైమ్ ఎక్కువగా జరుగుతున్న చోట వినియోగించండని ధ్వజమెత్తారు. ఇది సీఎం కేసీఆర్ కురచ బుద్ధికి నిదర్శమని మండిపడుతున్నారు. బీజేపీ ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని.. ఆ అసహనంతో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. అలాంటి సమావేశాలపై నిఘా పెట్టడం దారుణమని కమలం నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.



    కాగా, టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇప్పటికే ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే..హైదరాబాద్‌లోని అన్ని ప్రచార హోర్డింగ్‌లను టీఆర్ఎస్ తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. బీజేపీ కంటే ముందే.. అంతా ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్ బోర్డులను ఏర్పాటు చేసింది. తద్వారా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా చేసింది. ఐనప్పటికీ చాలా చోట్ల బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను పెట్టింది. సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కల్వకుంట్ల వారసత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమ గీతం పాడతారని స్పష్టం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, BJP National Executive Meeting 2022, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు