Home /News /telangana /

TELANGANA STATE BJP PRESIDENT BANDI SANJAY VISITS NALGONDA TO KNOW PADDY ISSUES VRY

Bandi sanjay : బండి సంజయ్ జిల్లాల పర్యటన కారణం ఇదే.. ! మరింత పెరగనున్న పోలిటికల్ హీట్

బండి సంజయ్ ఫైల్ ఫోటో

బండి సంజయ్ ఫైల్ ఫోటో

Bandi sanjay : ధాన్యం కొనుగొళ్ల రైతుల ఇబ్బందులను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపటి నుండి రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీంతో వరిధాన్యం కొనుగోళ్లపై రాజకీయం మరింత వేడెక్కనుంది.

    ధాన్యం కొనుగోళ్లకు బాధ్యత మీదంటే మీదంటూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ అధికార టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP) పోటాపోటీగా నిరసనలకు దిగారు. ఇందుకు అదనంగా బీజేపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ప్రస్తుతం వరిధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులను పరిశీలించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) తెలిపారు. రేపు, ఎల్లుండి నల్గొండ(nalgonda), సూర్యాపేట(suryapeta) జిల్లాల రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నట్లు తెలిపారు.

    మరోవైపు వరిధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు బీజేపీ ప్రకటించింది.ఈ క్రమంలోనే నల్గొండ రూరల్‌(nalgonda) మండలంలోని అర్జాలబావి ఐకేపీ సెంటర్‌ను సందర్శించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు..దీంతో పాటు మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేసి... మంగళవారం తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పుల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు. ఇక బండి సంజయ్ పర్యటనలో ప్రధానంగా మార్కెట్‌లో ధాన్యం అమ్మకంపై ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించనున్నట్లు సమాచారం...

    ఇది చదవండి : ఏసి బస్సులో ఎగిసిన మంటలు.. ఒకే రోజు మూడు ఆర్టీసీ ప్రమాదాలు... ఇద్దరు మృతి..


    బండి సంజయ్ సంజయ్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ప్లెక్సీలను ఏర్పాటు చేసే పనిలో కమలం శ్రేణులు నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలంటూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా ప్రస్తుత వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఇప్పటికే వరిధాన్యం కొనుగోళ్లపై వివాదం కొనసాగుతుండగా బండి సంజయ్ పర్యటనతో ఇరు పార్టీల్లో ఆరోపణలకు మరింత అజ్యం పోసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, Paddy, Telangana bjp

    తదుపరి వార్తలు