• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA SPECIAL STORY ON PEDDA POTHANGAL VILLAGE OUTERS NOT ALLOWED WITHOUT AADHAR SU

Telangana: ఆ గ్రామంలోకి వెళ్లాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే.. అసలు ఆ నిబంధన ఎందుకు పెట్టారంటే..?

Telangana: ఆ గ్రామంలోకి వెళ్లాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే.. అసలు ఆ నిబంధన ఎందుకు పెట్టారంటే..?

పెద్ద పొతంగల్ గ్రామం

ఆ ఊరిలోకి ఎవరైనా కొత్తవారు అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా ఆధార్ ఉండాల్సిందే. వేరే ఉళ్లలో ఉన్న బంధువులు కూడా తమ వారి ఇంటికి వెళ్లాంటే కూడా ఆధార్ తప్పనిసరి.

  • Share this:
    విదేశాల‌కు వెళ్లేవారికి పాస్ పోర్ట్, వీసా త‌ప్ప‌ని స‌రి.. కానీ తెలంగాణలో ఆ గ్రామంలోకి ఎవ‌రైన వెళ్లాలంటే మాత్రం తప్పకుండా ఆధార్ ఉండాల్సిందే.. ఆధార్ కార్డు లేకుంటే గ్రామ పొలిమేర‌ల్లోకి కూడా ఎవరిని రానివ్వరు ఆ ఊరి జనాలు. ఊరిలో ఎవ‌రింటికైన‌ చుట్టాలు వ‌చ్చినా ఆధార్ లేకుంటే వ‌చ్చిన దారినే తిరిగి వెళ్లాల్సిందే. ఆ గ్రామ‌స్తులు గ‌త ప‌దేళ్లుగా ఈ క‌ట్టుబాటును కొనసాగిస్తున్నారు. అసలు ఆ ఊరి ఎక్కడుంది.. అసలు ఆ గ్రామస్తులు ఎందుకు కట్టుబాట్లు పెట్టుకున్నారో తెలియాలంటే స్టోరి చదవాల్సిందే. వివరాలు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పొతంగల్ గ్రామంలో 2,500 జనాభా ఉంది. పదేళ్ల క్రితం ఓ వ్య‌క్తి ఒళ్లంతా వీభూతి, కాషాయం బట్టలు వేసుకుని ఊరిలో వ‌చ్చాడు. గ్రామ‌స్తులు వ్య‌వ‌యంపై ఆదార‌ప‌డి జీవించేవారు.. అయితే మధ్యాహ్నం గ్రామంలో ఇళ్ల‌కు తాళాలు వేసి, పొలం పనుల‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వారిని గమనించి మాట‌ల‌తో ఓ వ్యక్తిని నమ్మించాడు. బంగారాన్ని పూజ చేసి రెట్టింపు చేస్తానని న‌మ్మ‌బ‌లికాడు.

    దీంతో బాబా మాయమాటలు నమ్మిన ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకు వ‌చ్చి బాబా చెప్పిన‌ట్టు చేసారు. ఆ దొంగ బాబా త‌న ప‌ని పూర్తి చేసుకుని అక్క‌డి నుంచి ఉడాయించాడు. అతడు తేరుకుని చూడ‌గా బంగారం లేదు. ఆ బాబా కొసం ఎంత వేతికినా ఆచూకీ ల‌భించలేదు. ఆప్ప‌టి నుంచి ఆగ్రామ‌స్తులు అంద‌రు క‌లిసి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. తమ గ్రామంలోకి ఎవ‌రు వ‌చ్చిన ముందు గ్రామ‌పంచాయితీ వ‌ద్ద వారి ఆధార్ కార్డు ఇచ్చినా త‌రువాతే గ్రామంలోకి రావాలి లేదంటే ఎంతటి వారైన తిరిగి పంపాల‌ని క‌ట్టుబాటు పెట్టుకున్నారు.



    Pedda Pothangal Village, Kamareddy District, పెద్ద పొతంగల్, కామారెడ్డి జిల్లా
    పెద్ద పొతంగల్


    అప్ప‌టి నుంచి పెద్ద పొతంగల్​ గ్రామంలోకి రాగానే ముందుగా పంచాయితీ కార్య‌ల‌యం క‌నిస్తుంది. ఎదురుగా పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఉదయం నుంచి రాత్రి వరకు స్థానికులతో పాటు పంచాయితీ వారు​ కూర్చొని​ ఉంటారు. కొత్త వ్యక్తి కనిపించగానే ఊరు, పేరు, ఎందుకు వ‌చ్చావు అనే విష‌యాలు అడిగి తెలుసుకుంటారు. ఆధార్​ కార్డు తీసుకున్న త‌ర్వాత ఊళ్లో అడుగుపెట్టనిస్తారు. గ్రామంలోకి కూర‌గాయ‌లు అమ్మ‌డానికి వ‌చ్చినా.. ఐస్ క్రింమ్ అమ్మేవారు వ‌చ్చినా గ్రామ పంచాయ‌తీ కార్యాలయంలో ఐడి ఇచ్చి తిరిగి గ్రామంలో నుంచి వెళ్లే స‌మ‌యంలో వారి ఐడీ వారు తిసుకోని వెళ్లాల్తారు. ఈ నిబంధన అమ‌లు చేసిన‌ప్ప‌టి నుంచి గ్రామంలో ఎలాంటి దొంగ‌త‌నాలు, మోసాలు జ‌రుగ‌డం లేద‌ని గ్రామాస్తులు చెబుతున్నారు.

    -(మహేందర్, నిజామాబాద్ కరస్పాండెంట్, న్యూస్ 18)
    Published by:Sumanth Kanukula
    First published: