• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • TELANGANA SEXUAL ASSAULT ON MENTALLY DISABLED WOMAN IN KOSGI SU

Telangana: దారి తప్పుతున్న లోకం.. మతిస్థిమితం లేని మహిళపై మృగాళ్ల దాడి.. మూడోసారి తల్లైన అభాగ్యురాలు

Telangana: దారి తప్పుతున్న లోకం.. మతిస్థిమితం లేని మహిళపై మృగాళ్ల దాడి.. మూడోసారి తల్లైన అభాగ్యురాలు

ప్రతీకాత్మక చిత్రం

రానురాను సమాజంలో అమానవీయ ఘటనలు పెరిగిపోతున్నాయి. మతిస్థితిమితం లేని మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు.

 • Share this:
  రానురాను సమాజంలో అమానవీయ ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళ, బాలికలను రక్షణ అనేది కరువై పోతుంది. మతిస్థితిమితం లేని మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు. తాజాగా మతిస్థిమితం లేని ఓ మహిళపై లైంగిక దాడి చేసి బిడ్డకు తల్లిని చేసిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో వెలుగుచూసింది. అది కూడా మూడోసారి కావడం సమాజంలో పరిస్థితులు ఎంత భయంకరంగా మారుతున్నాయో తెలియజేస్తుంది. వివరాలు.. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో ఓ మహిల చిచ్చమెత్తుతూ రోడ్లపైనే జీవనం సాగిస్తుంది. ఆమె తల్లిదండ్రులు చనిపోగా.. అన్న ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మతిస్థిమితం కోల్పోయింది. అయితే అలాంటి మహిళకు కొందరు మృగాళ్లు పాడు బుద్దిని ప్రదర్శించారు. ఆమెపై లైంగికదాడులకు పాల్పడి ఇప్పటికే రెండుసార్లు తల్లిని చేశారు. తాజాగా ఆదివారం బస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌బంకు వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమె పురిటి నొప్పులతో బాధపడటం గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం అందించారు.

  దీంతో అక్కడికి చేరుకున్న ప్రభుత్వ వైద్యురాలు ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన తర్వాత ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక, ఆ బిడ్డను తమ ఆధీనంలోకి తీసుకున్న అంగన్‌వాడీ సిబ్బంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని చైల్డ్ కేర్ హోమ్‌కు అప్పగించారు. గతంలో ఆ మహిళకు జన్మించిన ఇద్దరు బిడ్డలను కూడా అక్కడికే తరలించినట్టుగా తెలిసింది.

  అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధిత మహిళకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు