హోమ్ /వార్తలు /తెలంగాణ /

వేగంగా తెలంగాణ సచివాలయం తరలింపు... ఒక్కో రోజు ఒక్కో శాఖ...?

వేగంగా తెలంగాణ సచివాలయం తరలింపు... ఒక్కో రోజు ఒక్కో శాఖ...?

తెలంగాణ సచివాలయం (File)

తెలంగాణ సచివాలయం (File)

Telangana News : ఎవరు ఏమన్నా, ఏ రాజకీయ పార్టీ ఏ అభ్యంతరాలు చెప్పినా... తెలంగాణ ప్రభుత్వం మాత్రం సమస్య లేదంటోంది. నిర్ణయం అమలై తీరుతుందని కుండ బద్ధలు కొడుతోంది.

ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయం ఎందుకూ పనికిరాదనీ, వాస్తు దోషాలు ఉన్నాయనీ, తాము నిర్మించబోయే కొత్త సచివాలయం అత్యద్భుతంగా ఉండటమే కాక... అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో ఆశ్చర్యపోయేలా ఉంటుందని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం... ఇప్పుడున్న సచివాలయంలో ప్రభుత్వ శాఖల్ని తరలించే పని మొదలుపెడుతోంది. జులై 1 నుంచీ ఈ కార్యక్రమం ఉంటుంది. సరిగ్గా నెల రోజుల్లో దీన్ని పూర్తి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సెక్రటేరియట్‌లో మొత్తం 29 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వాటికి సంబంధించి మంత్రుల ఛాంబర్లు, కార్యదర్శుల కార్యాలయాలు ఇలా అన్నింటినీ ఎక్కడెక్కడికి తరలించాలో ప్లాన్ సిద్ధం చేసిన సాధారణ పరిపాలనా శాఖ... రేపటి నుంచే పని మొదలుపెట్టాలని ఆదేశించింది.

జులై 1 నుంచీ ఏ శాఖకు ఆ శాఖ... తమను ఎక్కడికి తరలిస్తే, అక్కడికి సామగ్రిని తీసుకుపోవాల్సి ఉంటుంది. రోజుకో శాఖను తరలించినా మొత్తం ప్రక్రియ పూర్తవడానికి నెల రోజులు పడుతుందనే అంచనాతో... ప్రభుత్వం జులై చివరి వరకూ టైమ్ ఇచ్చింది. అదీకాక... ఇప్పటివరకూ 21 శాఖల కార్యాలయాలకు సంబంధించి మాత్రమే భవనాలు సిద్ధమయ్యాయి. మిగతా ఆఫీసుల్ని ఎక్కడికి తరలించాలనేది ఓ వారంలో డిసైడ్ చేస్తారు.

ఈ తరలింపు ప్రక్రియ పూర్తి కాగానే... కొత్త సచివాలయ నిర్మాణం మొదలవుతుంది. వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

Published by:Krishna Kumar N
First published:

Tags: Telangana News, Telangana updates

ఉత్తమ కథలు