TELANGANA SC DEVELOPMENT MINISTER KOPPULA ESHWAR SAID THAT ELIGIBLE PERSONS LIST OF DALITH BANDHU WILL BE RELEASED BEFORE FEBRUARY 5TH PRV
Dalith bandhu: ఫిబ్రవరి 5లోగా దళితబంధు అర్హుల జాబితా.. ప్రకటించిన ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కొప్పుల ఈశ్వర్ (ఫైల్)
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 118 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు. కాగా, దీనిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అప్డేట్ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు (Dalith bandhu) కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు (Dalith Bandhu)ను రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 118 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు. కాగా ప్రతి నియోజకవర్గంలో వందమందికి ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎస్సీల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Telangana SC's development minister koppula Eshwar) అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక శాసనసభ్యుల సలహాతో వచ్చే నెల 5లోగా దళితబంధు అర్హుల జాబితా (List of Dalit eligible persons)ను రూపొందించాలని కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఆ జాబితా ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులతో ఆమోదం పొందాలని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మార్చి 7 తేదీ లోపు ఈ పథకానికి సంబంధించిన ఆస్తులను పంపిణీ చేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో అర్హుల ఎంపికకు ప్రత్యేక అధికారులను నియమించుకోవాలన్నారు.
దళితబంధు పథకం అమలుపై కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “ఇప్పటికే హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తుండగా... మిగిలిన 118 నియోజకవర్గాల్లో వందేసి కుటుంబాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాలని ఇటీవలి మంత్రిమండలి (Ministry) సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr) నిర్ణయించారని తెలిపారు.
దీని కోసం రూ.1,200 కోట్లు కేటాయించి అందులో రూ. వంద కోట్లు ఇప్పటికే విడుదల చేశామన్నారు. రెండు మూడు రోజుల్లో మిగిలిన రూ.1,100 కోట్లు కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ఒక్కో లబ్ధిదారుకు మంజూరైన రూ.10 లక్షల నుంచి రూ.10 వేలతో ప్రత్యేక దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని వారు సూచించారు.
ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి..
మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం దళిత బంధని (Dalth Bandhu), దేశంలోనే ప్రత్యేకంగా దళితుల కోసం తీసుకున్న గొప్ప పథకమని అన్నారు. రాష్ట్రంలోని హుజరాబాద్ నియోజకవర్గం , వాసాలమర్రి గ్రామం మరియు మరో 4 మండలాలలో పూర్తిస్థాయిలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. దళిత బంధుతో నిరుపేద షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాల్సిన అవసరముందని, నిరుపేద దళిత కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అర్హుల ఎంపికపై ప్రత్యేక అధికారులకు స్పష్టమైన సూచనలు ముందే ఇవ్వాలని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.