కొందరు ఆడపిల్ల పుట్టిందంటే అదృష్టంగా భావిస్తారు. తమ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని అనుకుంటారు. కానీ మరికొందరు ఆడపిల్ల అంటేనే బరువుగా భావిస్తున్నారు. కడుపులో పెరుగుతున్న పిండం ఆడపిల్ల అని తెలియగానే మహిళకు అబార్షన్ చేయించేవారు కూడా ఉన్నారు. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సర్పంచ్ ఆడపిల్ల పుడితే కానుకగా డబ్బులు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అది మరేక్కడో కాదు తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే. వివరాలు.. కుమురం భీం జిల్లాలోని దహెగాం మండలం బీబ్రా గ్రామ సర్పంచ్ బండ కృష్ణమూర్తి ఆడపిల్లల రక్షణ కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఆడపిల్లలను తల్లిదండ్రులు బరువు భావించకూడదని చెప్పే ఆయన.. వారికి తనవంతు సాయం చేస్తున్నారు.
ఈ మేరకు 2020 జూన్ 2న, తన తల్లిదండ్రులైన బండ సుదర్శన్, సులోచనల పెళ్లిరోజును పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీలో మొదటి కాన్పుగా ఆడపిల్ల పుడితే రూ.5 వేలు చిన్నారి తల్లి పేరిట డిపాజిట్ చేస్తానని ఈయన గ్రామస్తుల ముందు ప్రకటించారు. అన్నట్టుగానే మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన వెంటనే తన సొంత డబ్బును పోస్టాఫీసులో మాతృమూర్తి పేరిట డిపాజిట్ చేస్తున్నారు. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెబుతారు కృష్ణమూర్తి. ఇక, ఈయన చేస్తున్న పనిని పలువురు అభినందిస్తున్నారు.
No Lock down, curfew: లాక్ డౌన్ , కర్ఫ్యూ ఆలోచన లేదు.. ఒకవేళ పెడితే కొరొనా కంటే ఎక్కువ మరణాలు ఆకలితో ఉంటాయి: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
Attacked sanitation workers: మేము మాస్క్ ధరించం.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మున్సిపల్ సిబ్బందిపై పార, గడ్డపారతో దాడి.. ఎక్కడంటే..
Nagarjunasagar by election : సాగర్లో 31శాతం పోలింగ్.. ఎవరు ఎక్కడ ఓటు వేశారు ?
Nagarjunasagar by election :సాగర్లో 30 శాతం పోలింగ్.. కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్