ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సీరియస్... నేడు కీలక నిర్ణయం

Telangana RTC Strike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఇవాళ సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 5:54 AM IST
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సీరియస్... నేడు కీలక నిర్ణయం
కేసీఆర్, ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 5:54 AM IST
Telangana RTC Strike : శుక్రవారం అర్థరాత్రి నుంచీ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో... తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా్రు. సమ్మెకు దిగిన ఉద్యోగులంతా శనివారం సాయంత్రం 6 గంటల లోపు తిరిగి విధుల్లో చేరాలనీ, లేదంటే చేరని వాళ్లను ఉద్యోగాలు వదిలేసిన వాళ్లుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ 52 వేల మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరలేదు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఐతే, ప్రభుత్వం మాత్రం మరోసారి చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారు. ఆయన ఏం చెబుతారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్ అయ్యింది.

సమ్మె కారణంగా శనివారం తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టైముకి బస్సులు లేక... ఆటోలు, ప్రైవేట్ వాహనాలపై ఎక్కువ ఛార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వచ్చింది. ప్రభుత్వం తాత్కాలికంగా కొందర్ని రిక్రూట్ చేసుకొని... కొన్ని బస్సులు నడిపించినా, అవి ఏమాత్రం సరిపోలేదు. ప్రయాణికులు ఎక్కడికక్కడ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు లేవు కాబట్టి సరిపోయింది... అవి కూడా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలిగేవే.

ప్రస్తుతం దసరా సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో బస్సులు బంద్ అవ్వడంతో... పండక్కి ఊరు ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు వాళ్లకు. ఇదే సమయంలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు... సడెన్‌గా ఛార్జీలు పెంచేశాయి. 300 కిలోమీటర్ల జర్నీకి కూడా... దాదాపు రూ.1500 నుంచీ రూ.2000 దాకా తీసుకుంటున్నాయి. డిమాండ్ ఉన్నప్పుడే బిజినెస్ చేసుకోవాలన్న ఫార్ములాను ఫాలో అవుతున్నాయి.

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు సెప్టెంబర్‌కి ఇవ్వాల్సిన జీతాలు ఇంకా అందలేదు. ప్రభుత్వం కావాలనే జీతాలను ఆపేసిందనే ఆందోళన వారిలో ఉంది. ప్రభుత్వం మరిన్ని బస్సుల్ని ఏపీ నుంచీ తెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అందువల్ల సర్కార్ ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేనట్లు కనిపిస్తోంది. ఇవాళ కేసీఆర్ కూడా ఉద్యోగులకు వ్యతిరేకంగానే ప్రకటన చేస్తారనే వాదన వినిపిస్తోంది.

First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...