నా మాట వినండి.. సీఎం కేసీఆర్, ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సలహా

తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు 17 రోజుల పాటు సమ్మె చేశారని, వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

news18-telugu
Updated: October 7, 2019, 2:54 PM IST
నా మాట వినండి.. సీఎం కేసీఆర్, ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సలహా
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్‌‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె చేస్తే.. ఆర్టీసీ ఉద్యోగులు కూడా అందులో భాగం అయ్యారని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. ‘తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదు. తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48,660 మంది ఉద్యోగులలో 1,200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజులపాటు నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశాం. ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా వుంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావును కోరుతున్నా.’ అని పవన్ కళ్యాన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

మందు బంద్ చేస్తేనే పిల్లలు పుడతారు..

First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading