హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ సమ్మె... ప్రైవేట్ బస్సులు ప్రయాణికులకు కలిసొస్తాయా?

ఆర్టీసీ సమ్మె... ప్రైవేట్ బస్సులు ప్రయాణికులకు కలిసొస్తాయా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSRTC Strike : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 51వ రోజు కొనసాగుతోంది. ప్రైవేట్ బస్సు పర్మిట్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మరి ప్రైవేట్ బస్సులు... ఇప్పుడున్న ఛార్జీలతోనే నడుస్తాయా?

Telangana RTC Strike : తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె ఎలా ఉన్నా... ప్రయాణికులకు ఛార్జీలు పెంచకుండా సేవలు అందించాలన్నది అసలు టార్గెట్. ప్రైవేట్ రూట్ పర్మిట్లు, ప్రైవేట్ బస్సుల్ని తెస్తే... కచ్చితంగా ఛార్జీలు పెరుగుతాయన్నది సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, కొందరు ఆర్థిక, రాజకీయ నిపుణుల మాట. ప్రభుత్వం మాత్రం... ప్రైవేటీకరణ వల్లే ఆర్టీసీ గట్టెక్కుతుందని అంటోంది. ఛార్జీలు పెంచకుండా సర్వీసులు అందిస్తామనే సంస్థలకే అనుమతులు ఇస్తామని అంటోంది. లాభాలు వచ్చే రూట్లలో ఆర్టీసీని నడుపుతూ... లాభాలు రాని రూట్లలో ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తామంటోంది. కానీ వాస్తవంలో ఇలా జరుగుతుందా అన్నది తేలాల్సిన ప్రశ్న. లాభాలు లేకుండా బస్సులు నడిపేందుకు ప్రైవేట్ సంస్థలు ఎందుకు ముందుకు వస్తాయన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు. ప్రజాసేవ చెయ్యడం ప్రైవేట్ సంస్థల అసలు టార్గెట్ అవ్వదు. ప్రైవేట్ సంస్థలు ఎప్పుడైనా లాభాపేక్షతోనే పనిచేస్తాయన్నది ఆర్థిక సిద్ధాంతం. అందువల్ల ఛార్జీల పెంపు లేకుండా... ప్రైవేట్ సంస్థలు పని చెయ్యవన్న అభిప్రాయం ఆర్థిక విశ్లేషకుల నుంచీ వస్తోంది. ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచకుండానే ఫలితాన్ని రాబడతామనే కాన్ఫిడెన్స్‌లో ఉంది.

ఆర్టీసీ సమ్మె ప్రారంభమై ఇవాళ్టికి 51వ రోజు. ఇన్ని రోజులు సమ్మె చేసినా... ఆర్టీసీ కార్మికులు సాధించింది ఏమీ లేదు. చివరకు తమంతట తామే విధుల్లోకి చేరతామని చెప్పినా... ప్రభుత్వం ఆ ఛాన్స్ ఇవ్వకుండా... ప్రైవేట్ పర్మిట్లవైపు చూస్తోంది. ఆర్టీసీలోని 5,100 బస్సుల స్థానంలో ప్రైవేటు బస్సులకు రూటు పర్మిట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీలో ప్రభుత్వ బస్సులు, అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. మొత్తం 10,460 బస్సుల్లో అద్దె బస్సులు 2,103 ఉన్నాయి. వీటిని పూర్తిగా తొలగించి... మొత్తం 5,100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వనున్నారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ బస్సుల్లో వసూలు చేస్తున్న ఛార్జీలే తీసుకుంటాయన్నది ప్రభుత్వం ఇస్తున్న హామీ. ఇక్కడే ఓ సమస్య ఉంది. ఆర్టీసీ బస్సుల్లో... రాజధాని, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, సూపర్ లగ్జరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు ఇలా వేర్వేరు బస్సులు వేర్వేరు ఛార్జీలతో నడుస్తున్నాయి. ప్రైవేట్ బస్సులన్నీ సూపర్ లగ్జరీ తరహావే నడిస్తే... అది ప్రయాణికులకు భారమే అవుతుంది. మరి వాటిలో కూడా ఇన్ని రకాల బస్సులు నడుస్తాయా అన్నది తేలాల్సిన ప్రశ్న. ఛార్జీలు పెంచకపోతే... ఆర్టీసీ ఛార్జీలతో బస్సులు నడపడం కష్టమే అంటున్నారు ప్రైవేట్ ఆపరేటర్లు.

ఇలా ఎన్నో సమస్యలు, సవాళ్లు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. ఇన్ని సవాళ్లు ఉండటం వల్ల ఈ సమస్య ఇప్పట్లో తేలడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది.


అదిరే ఫొటోలతో కట్టిపడేస్తున్న హంసా నందిని


ఇవి కూడా చదవండి -

మహారాష్ట్ర పంచాయతీ... సుప్రీంకోర్టు ఏం చెబుతుంది?

Home Tips : స్ప్రేలతో పనిలేకుండా బొద్దింకల్ని తరిమికొట్టాలా... ఇలా చేస్తే సరి...

Health : బఠాణీలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...


పార్టీ టైమ్... హ్యాంగోవర్ అదుపులోకి రావాలంటే...


Health : పొడవైన జుట్టు సీక్రెట్ తెలిసిపోయింది... మీరూ పాటించండి

First published:

Tags: Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu, Tsrtc privatization, TSRTC Strike