TELANGANA RTC PROVIDING 3500 SPECIAL BUSSES TO PASSENGERS WHO WANTS TO COME BACK FROM THEIR HOME AFTER SANKRANTI FESTIVAL PRV
Telangana RTC: సంక్రాంతికి సొంతూళ్లకి వెళ్లి తిరిగివచ్చే వారికి ఆర్టీసీ గుడ్న్యూస్.. వారి కోసం ప్రత్యేక బస్సులు..
rtc bus pallevelugu
పండుగ రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా చార్జీలను పెంచేస్తుంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనికి ఫుల్స్టాప్ పెట్టాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో పండగకి సొంతూరుకు వెళ్లి తిరిగి రావాలనుకునే వారికి గుడ్న్యూస్ అందించారు.
తెలంగాణ ఆర్టీసీకి (Telangana RTC) ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ (V.C Sajjanar IPS) తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల (TSRTC Passengers) నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంకా ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. కాగా, సంక్రాంతి నేపథ్యంలో వేరే ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నవారు, చదువుకోసం, ఉద్యోగం కోసం వెళ్లిన వారు సొంతూళ్లకు వస్తుంటారు. అయితే ఇదే అదునుగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా చార్జీలను పెంచేస్తుంది. దీంతో సామాన్యుడి జేబులు గుల్ల అవక మానవు. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనికి ఫుల్స్టాప్ పెట్టాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో పండగకి సొంతూరుకు వెళ్లి తిరిగి రావాలనుకునే (Who wants to come back) వారికి గుడ్న్యూస్ అందించారు.
సొంత గ్రామాలకు వెళ్లిన వారి తిరుగు ప్రయాణం కోసం 3,500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) ప్రకటించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ వెల్లడించారు. అంతేకాకుండా స్పెషల్ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవన్నారు. దీంతో ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సులను ఎంచుకుని సురక్షితంగా స్వగ్రామాల నుంచి తిరిగి రావచ్చని (Come back from their home) సూచించారు.
పండుగ నేపథ్యంలో రైల్వేశాఖ కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 110 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రజా రవాణా సాధనాలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ నుంచి మేడారానికి (Hyderabad to Medaram) వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి మేడారం జాతర (Medaram jatara)కు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ప్రకటించారు. అయితే, హైదరాబాద్ లోని హైదారాబాద్-1, హైదరాబాద్-2, పికెట్ డిపోల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. ఇక టికెట్ ధరను ఒకరికి రూ.398 చొప్పున (Less cahrges) వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేడారం వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.