ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్

సంస్థ ఇదే విధంగా ముందుకు కొనసాగితే డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలనే ఆలోచనలో సంస్థ ఉన్నట్లు సునీల్ శర్మ తెలిపారు.

news18-telugu
Updated: February 15, 2020, 4:46 PM IST
ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్
ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కేఎంపీఎల్‌అవార్డుల ప్రదానోత్సవానికి సునీల్‌శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు అవార్డులను అందజేశారు. ఉద్యోగుల బదిలీలు, ఓడి తదితర అంశాలపై సైతం చర్చిస్తున్నట్లు సునీల్ శర్మ వెల్లడించారు. సమష్టి కృషితో నెలకు రూ.80-90 కోట్ల అధిక ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు.

సంస్థ ఇదే విధంగా ముందుకు కొనసాగితే డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలనే ఆలోచనలో సంస్థ ఉన్నట్లు సునీల్ శర్మ తెలిపారు. సురక్షిత డ్రైవింగ్‌తో ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుండటం అభినందనీయమన్నారు. సంస్థలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై దృష్టిసారించినట్లు తెలిపారు. సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసినట్లు సునీల్ శర్మ వివరించారు. సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామన్నారు. త్వరలో కార్గో సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. పీఎఫ్‌ బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని సునీల్‌శర్మ తెలిపారు.


First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు