Home /News /telangana /

TELANGANA RTC MD SAJJANAR ONE MORE MEMES GETTING VIRAL VRY

RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అటు చిరంజీవిని ఇటు జూ.ఎన్టీఆర్‌ను సైతం వదల్లేదు...!

Rtc md vc sajjanar

Rtc md vc sajjanar

RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికుల కోసం మరో రెండు సినిమా మీమ్స్ పోస్ట్ చేశారు. ఒకటి ఆర్టీసీ ప్రయాణికులకు సంబంధించి కాగా మరోకటి కార్మికుల శ్రమకు సంబంధించింది .. దీంతో ఆ మీమ్స్ మరోసారి వైరల్ గా మారాయి.

    ఆర్టీసి బలోపేతానికి నడుం బిగించిన ఎండీ వీసి సజ్జనార్ అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు వెనువెంటనే తీసుకోవడంలో ముందస్తు వ్యుహాలు రచిస్తున్నాడు... ఈ క్రమంలోనే కొత్తగా ఆలోచించడంలో ఎప్పుడూ ముందుండే సజ్జనార్ మీమ్స్ ఉపయోగించడంలో కూడా ప్రజలను అటు ప్రయాణికులకు ఆకట్టుకుంటున్నారు.

    ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ సంధర్భంగా సంక్రాంతికి ధరలు పెంచకుండా ప్రయాణీకులు బస్సుల్లోనే వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని తెలిపే కొన్ని సినిమా పోస్టర్లు, సన్నివేశాలను చూపుతూ ఆర్టీసీ మీమ్స్ తయారు చేసి విడుదల చేస్తున్నారు. సినిమాలోని సీన్ తో ఆర్టీసీ గురించి చెప్పిన దృశ్యాన్ని ఇప్పుడు సజ్జనార్ ఉపయోగిస్తున్నారు.





    దీంతో ఓ సినిమాలోని శారద, చిరంజీవి, ఖుష్బూ, అందరూ బస్సులో ప్రయాణించే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకుని వినూత్న ప్రచారాన్ని రూపొందించారు. ఆర్టీసీ బస్సులో కనీసం ఒక్కరోజైనా ప్రయాణించి సంస్థ మనుగడకు మన వంతు కృషి చేద్దాం.. అంటూ సజ్జనార్ షేర్ చేసిన వీడియో ట్వీట్ వైరల్ అవుతోంది.




    మరోవైపు ఆర్టీసీ కార్మికులు పండగ రోజున తన కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజలకు సేవలను అందిస్తుండడంతో వారికి గుర్తింపునిచ్చే విధంగా మరో మీమ్‌ను పోస్ట్ చేశారు.. ఈక్రమంలోన జూ.ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్‌ ఓ డైలాడ్ పోస్టో చేశారు.. దాంట్లో.. చివర్లో పండగ పూట కూడా ఎక్కడికి ఆనంద్ అని అంటే.. అక్కడ ఇంకో ఇంట్లో పండగ జరగడం లేదని వెళ్తున్నానంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను కార్మికులకు అప్లై చేశాడు. ‘‘పండుగ పూట కూడా డ్యూటీ ఏంటి ఆనంద్?? ఈరోజు ఇంట్లో ఉండొచ్చు కదా!! ’’ అంటే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఇంకా చాలా ఇళ్లలో పండుగ జరగాలని వెళ్తున్నానంటూ చెబుతున్నట్లు మీమ్‌ను పోస్ట్ చేశారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Sajjanar, Tsrtc, Twitter

    తదుపరి వార్తలు