అర్థరాత్రి నుంచీ ఆర్టీసీ ఛార్జీల పెంపు... ఇవీ కొత్త ఛార్జీల లెక్కలు...

Telangana : తెలంగాణలో నెలకు రూ.700 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా ఇవాళ అర్థరాత్రి నుంచీ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం.

news18-telugu
Updated: December 2, 2019, 7:31 AM IST
అర్థరాత్రి నుంచీ ఆర్టీసీ ఛార్జీల పెంపు... ఇవీ కొత్త ఛార్జీల లెక్కలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Telangana : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లు తయారైందంటున్నారు తెలంగాణలో పరిస్థితి. సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు బాగానే ఉన్నారు. వాళ్లపై అప్పట్లో మండిపడిన సీఎం కేసీఆర్... ఇప్పుడు వరాలు ప్రకటించి, సమ్మె కాలంలో జీతాలు కూడా ఇచ్చేస్తూ... వాళ్ల ప్రశంసలు పొందుతూ ఖుషీగా ఉన్నారు. ఎటొచ్చీ... తామే... రెండు నెలలుగా నానా తిప్పలు పడి... ఇప్పుడు మళ్లీ ఛార్జీల పెంపు భారాన్ని భరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడుతున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే... తమపై భారం వెయ్యడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదేం లెక్క అని అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం అర్థరాత్రి నుంచీ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతోంది. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచుతోంది. ఆ లెక్కన 100 కిలోమీటర్లు ప్రయాణించేవారికి... టికెట్ చార్జీ అదనంగా రూ.20 పెరుగుతుంది.

ఐతే... ఇక్కడ మరో లెక్క కూడా ఉంది. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచితే... ప్రజల దగ్గర 20 పైసలు ఉండదు కాబట్టి... రౌండప్ చేస్తారు. అంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో కనిష్ట ఛార్జీ రూ.5 ఉండగా... 2 నుంచీ 5వ స్టాప్ వరకూ ప్రస్తుతం రూ.10 తీసుకుంటున్నారు. కొత్త ఛార్జీల ప్రకారం ఇకపై రూ.15 తీసుకుంటారు. ఇలా ప్రతి నాలుగు స్టాపులకూ రూ.5 పెంచుకుంటూ పోతారు. పల్లె వెలుగు బస్సుల్లో కూడా కనీస ఛార్జీ రూ.10గా ఉంచి... ఐదు కిలోమీటర్ల తర్వాత రూ.15 చేస్తున్నారు. చిల్లర సమస్య రాకుండా ఇలా చేస్తున్నా... ప్రయాణికులపై మాత్రం భారీ ఛార్జీల మోత తప్పదు.

Pics : హాట్ అందాల విందు చేస్తున్న త్రియాదాస్ఇవి కూడా చదవండి :

నల్గొండలో ప్రమాదం... ప్రైవేట్ బస్సులో మంటలు

మలేసియా యువతి... మర్డర్ ప్లాన్... 9 మందితో...

తమిళనాడు అతలాకుతలం... తెలుగు రాష్ట్రాలకూ వర్ష సూచన


ఘోర రోడ్డు ప్రమాదం... ఆటోను ఈడ్చుకుపోయిన ట్రక్...


సాప్ట్‌వేర్ యువతిపై రేప్ కేసులో మరో టిస్ట్... సాయంత్రం వరకూ...
Published by: Krishna Kumar N
First published: December 2, 2019, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading