హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: తెలంగాణ నుంచి ఆ రాష్ట్రాలకు బస్సు సర్వీసులు.. ఏపీకి ఇప్పట్లో కష్టమే..

TSRTC: తెలంగాణ నుంచి ఆ రాష్ట్రాలకు బస్సు సర్వీసులు.. ఏపీకి ఇప్పట్లో కష్టమే..

తెలంగాణ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ

TS RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి ఉదయం నుంచి అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని సంస్థ అధికారులు నిర్ణయించారు. బెంగళూరుకు మినహా కర్ణాటక , మహారాష్ట్రకు బస్సులు నడవనున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల కార్పొరేషన్లు కూడా తెలంగాణకు బస్సు సర్వీసులు నడపనున్నాయి

ఇంకా చదవండి ...

  Telangana RTC Services Update: కరోనా దెబ్బకు ప్రజా రవాణా కుదేలైంది. లాక్ డౌన్ తో డిపోలకే పరిమితమైన బస్సులు ఇంకా పూర్తి స్థాయిలో రోడ్డు ఎక్కలేదు. మే 19 నుంచి జిల్లాల్లో బస్సు సర్వీసులు ప్రారంభమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. శుక్రవారం నుంచి గ్రేటర్ పరిధిలో అధికారులు బస్సులు నడుపుతున్నారు. అయితే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు మాత్రం ఇంత వరకు నడవడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి(సోమవారం) ఉదయం నుంచి అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని సంస్థ అధికారులు నిర్ణయించారు.

  బెంగళూరుకు మినహా కర్ణాటక , మహారాష్ట్రలోని ప్రముఖ నగరాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడపనుంది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల కార్పొరేషన్లు కూడా తెలంగాణకు బస్సు సర్వీసులు నడపనున్నాయి. అయితే పొరుగు రాష్ట్రం ఏపీకి బస్సులు నడిపే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులకు నడిచేందుకు మాత్రం లైన్ క్లియర్ కాలేదు. అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండడం ఇందుకు అడ్డంకిగా మారింది.

  ఇప్పటికే తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య మూడు సార్లు చర్చలు జరిగాయి. అయినా ఈ సమస్య ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఇరురాష్ట్రాల మధ్య నాలుగో దఫా చర్చలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని... ఏపీఎస్‌ఆర్టీసీ కూడా అన్ని కిలోమీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు సూచిస్తున్నారు. కానీ అందుకు ఏపీ అధికారులు అంగీకరించ లేదు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో అధికారుల స్థాయిలో మరోదఫా చర్చలు నిర్వహించాలని గత సమావేశంలో నిర్ణయించారు.

  అయితే నాలుగో దఫా చర్చలకు మరింత సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు రోజూ 375 బస్సులను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ 206 సర్వీసులకు మాత్రమే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. ఐతే మిగిలిన మార్గాల్లో తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని ఏపీ అధికారులు కోరుతున్నారు. ఎవరూ బస్సులు నడపకుంటే ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాభం చేకూరుతుదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై తెలంగాణ నుంచి స్పష్టత లేదని చెబుతున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Rtc, Telangana

  ఉత్తమ కథలు