Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sankranti buses: సంక్రాంతికి ఊరికి వెళ్లాలనుకునే వారికి ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ట్విటర్​ ద్వారా ప్రకటించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

Sankranti buses: సంక్రాంతికి ఊరికి వెళ్లాలనుకునే వారికి ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ట్విటర్​ ద్వారా ప్రకటించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేట్​ ట్రావెల్స్​ భారీగా చార్జీలను పెంచేస్తుంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ దీనికి ఫుల్​స్టాప్​ పెట్టాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో పండగకి సొంతూరుకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​ అందించారు.

నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీకి (Telangana RTC) ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ (V.C Sajjanar IPS) తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల (TSRTC Passengers) నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంకా ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. కాగా, సంక్రాంతి నేపథ్యంలో వేరే ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నవారు, చదువుకోసం, ఉద్యోగం కోసం వెళ్లిన వారు సొంతూళ్లకు వస్తుంటారు. అయితే ఇదే అదునుగా చేసుకుని ప్రైవేట్​ ట్రావెల్స్​ భారీగా చార్జీలను పెంచేస్తుంది. దీంతో సామాన్యుడి జేబులు గుల్ల అవక మానవు. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ దీనికి ఫుల్​స్టాప్​ పెట్టాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో పండగకి సొంతూరుకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​ అందించారు.

సంక్రాంతి (Sankranti) పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ఎటువంటి అదనపు ఛార్జీలు (No Extra Charges) లేకుండా ప్రత్యేక బస్సులను (Sankranti buses) నడుపుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి 3,400, జేబీఎస్ నుంచి 1,200 రెగ్యులర్ బస్సులు నడుపుతుండగా.. పండుగ వేళ అదనంగా మరో 4,322 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు.

తెలంగాణకు 3,338, ఆంధ్రప్రదేశ్​కు 984 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. ఈ బస్సుల నిర్వహణకు 200 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. ప్రజలందరూ ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని సజ్జనార్ కోరారు. బస్సుల గురించి సమాచారం కోసం ఎంజీబీఎస్​కి 9959226257, జేబీఎస్​కి 9959226246 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని ఆయన ట్వీట్ చేశారు.

డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా..

తెలంగాణలోని ప్రతి ఆర్టీసీ బస్సులో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు (Credit cards)ల ద్వారా టికెట్ ను కొనుగోలు చేసే విధానాన్ని త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

నగదు రహిత, లావాదేవీల్లో భాగంగా ఆర్టీసీ (RTC) ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న బస్‌పాస్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టడం సహా వినియోగదారులకు శ్రమ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

First published:

Tags: Bus station, RTC buses, Sajjanar, Tsrtc