నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీకి (Telangana RTC) ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ (V.C Sajjanar IPS) తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల (TSRTC Passengers) నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంకా ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది.
కాగా, సంక్రాంతి నేపథ్యంలో వేరే ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నవారు, చదువుకోసం, ఉద్యోగం కోసం వెళ్లిన వారు సొంతూళ్లకు వస్తుంటారు. ఇక మేడారం జాతరకు అయితే లక్షలాది మంది వెళతారు. అయితే ఇదే అదునుగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా చార్జీలను పెంచేస్తుంది. దీంతో సామాన్యుడి జేబులు గుల్ల అవక మానవు. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనికి ఫుల్స్టాప్ పెట్టాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో మేడారం జాతర (Medaram jatara)కు వెళ్లేవారికి గుడ్న్యూస్ అందించారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లపై ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
జాతర (Medaram Jatara) దృష్ట్యా ఇప్పటి నుంచే భక్తుల రాకపోకలు పెరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ బస్సులను (Special RTC Busses) ఏర్పాటు చేస్తున్నారు. అయితే, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేయనున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి బస్సు రవాణా సౌకర్యాల ఏర్పాట్లు జరిగాయి. హనుమకొండ, వరంగల్ నుంచి అయితే, ఇప్పటికే ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకున్నారు.
కాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ నుంచి మేడారానికి (Hyderabad to Medaram) వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి మేడారం జాతర (Medaram jatara)కు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ప్రకటించారు. అయితే, హైదరాబాద్ లోని హైదారాబాద్-1, హైదరాబాద్-2, పికెట్ డిపోల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. ఇక టికెట్ ధరను ఒకరికి రూ.398 చొప్పున (Less cahrges) వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేడారం వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల సౌకర్యార్థం #MGBS నుండి మేడారం కు స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది https://t.co/EE9pOiiegh Website మరియు #TSRTC App నందు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు #TSRTCMedaramSpecial @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu @sakshinews @eenadulivenews @bbcnewstelugu @Postfity pic.twitter.com/U0cfcNLYF9
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 11, 2022
హన్మకొండ నుంచి..
మరోవైపు ఈనెల 11 నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతర (Medaram jatara)కు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ.65 చార్జీగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు..
2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీలు ఆలయ పూజరులు ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు ఈ జాతర నిర్వహించనున్నారు. సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఫిబ్రవరి 18-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఫిబ్రవరి చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు. ఫిబ్రవరి 18 సమ్మక్క- సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం, ఫిబ్రవరి 19 వన ప్రవేశం, మహా జాతర ముగింపు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medaram jatara, RTC buses, Sajjanar, Tsrtc