బార్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...

ఖమ్మం జిల్లాలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్డులో ఓ బార్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకుని వెళ్లింది.

news18-telugu
Updated: October 29, 2019, 2:44 PM IST
బార్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...
ఆర్టీసీ బస్సు ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతుండడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్డులో ఓ బార్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకుని వెళ్లింది. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు ప్రభుత్వం పట్టుదల వీడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల బస్సు ప్రమాదాలు జరిగి, బస్సులు డ్యామేజ్ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల ఏకంగా ప్రాణాలు కూడా పోతున్నాయి.

తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ గత 25 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే, విధులకు హాజరుకాని వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వ్యవహారం హైకోర్టుకు చేరింది. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కార్మికుల వాదనలు విన్న న్యాయస్థానం.. తొలుత ఏదో ఒక దశలో చర్చలను ప్రారంభించాలని సూచించింది. విలీనం కోసం కార్మికులు పట్టుబట్టకుండా మిగిలిన అంశాలపై చర్చలు జరిపితే కార్మికుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే.. ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది.

ఆ తండ్రి రియల్ బాహుబలి.. పిల్లాడిని ఎలా కాపాడాడో చూడండిFirst published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>