ఆర్టీసీ చార్జీల పెంపుదలపై కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆర్టీసీలో(rtc) ప్రయాణ చార్జీలను దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ రూట్లలో చార్జీలు పెంచాలి. కిలోమీటరు ఎంత పెంచాలనే అంశంపై చర్చిస్తున్నారు.. ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తకుండా టికెట్ల ధరను సర్దుబాటు చేస్తున్నట్టు సమాచారం. దూర ప్రాంతాల సర్వీసులకు కిలో మీటరుకు పావలా చొప్పున పెంచాలనే యోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.…
గతంలో పెచ్చినట్టుగా చిల్లర సమస్య తలెత్తకుండా చార్జీలు పెంచె దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లె, నగర బస్సులకూ ఇదే విధానం అమలు చేయాలన్నది అధికారుల ఆలోచన. ఈ రెండు సర్వీసుల్లో కనీస ఛార్జీలను సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఛార్జీలను సవరించారు. ముఖ్యంగా చార్జీలను సర్ధుబాటు చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇది చదవండి : ప్రభుత్వం ఊదితే ఊడిపోతుంది.. సిరిసిల్లలో సంజయ్ సంగ్రామ యాత్ర
గతంలో చార్జీలు ఇలా పెంచారు.
ఇక గతంలో ఆర్టీసీ చార్జీలు ఏ విధంగా పేరిగాయని పరిశీలిస్తే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010లో 25 శాతం పెంచగా... తర్వాత 2011లో చార్జీలు 8 శాతం పెరిగాయి. బస్సు టికెట్ ధరల వల్ల చిల్లర సమస్య వస్తుందంటూ 2012లో ఛార్జీలను సవరించారు. 2013లో 10 శాతం పెంచగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2016లో 10శాతం పెరిగాయి చార్జీలు.
నాలుగు నెలల్లో ప్రైవేట్‌పరం
కాగా రానున్న నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిన పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఓవైపు ఆర్టీసీ చైర్మన్ మరియు ఎండీలను సైతం నియమించిన విషయం తెలిసిందే... అందుకే చార్జీల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలకు సన్నద్దమవుతున్నట్టు సమాచారం.
ఇది చదవండి : కంటోన్మెంట్ పై మరోసారి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. విలీనమే అంటున్న మంత్రి
ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం
మరోవైపు ప్రభుత్వం చార్జీలు పెంచడంపై కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy) వ్యతిరేకించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే చార్జీలు పెంచుతున్నారని ఆరోపించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పెట్రో ఉత్పత్పుల పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పన్ను ద్వారానే ఆర్టీసీ వెన్నువిరిచారని ఆయన విమర్శించారు.
ఇది చదవండి : మహిళల బాత్రూంలో సెల్ కెమెరా... ! నిందితుడిపై నిర్భయ కేసు.. విచారణలో సంచనాలు.. !
పెదవి విరుస్తున్న ప్రయాణికులు
అయితే చార్జీల పెంపుదల పై కొంతమంది పెదవి విరుస్తున్నారు. కేవలం చార్జీల పెంపుదల వల్ల ఆర్టీసీ గాడిలో పడే అవకాశాలు లేవని చెబుతున్నారు.దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నాయి కార్మిక సంఘాలు. కిలోమీటరు పావలా పెంచడంపై పెదవి విరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.