Home /News /telangana /

TELANGANA PREGNANT WOMAN CROSSING CANAL IN CART IN ADILABAD DISTRICT SU ADB

Pregnant Woman: ఇలాంటి కష్టం రాకూడదు.. ఓవైపు పురిటి నొప్పులు.. మరోవైపు రోడ్డు లేక తిప్పలు..

ఎడ్లబండిలో గర్భిణిని వాగు దాటిస్తున్న బంధువులు

ఎడ్లబండిలో గర్భిణిని వాగు దాటిస్తున్న బంధువులు

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం, అత్యవసర సమయాల్లో నానా అవస్థలు పడుతున్నారు. వర్షకాలంలో అయితే వారి బాధలు వర్ణనాతీతం అనే చెప్పాలి. సరైన సౌకర్యాలు లేక.. ఎజెన్సీలోని గిరిజనుల పడుతున్న అవస్థలు తెలిపే ఎన్నో ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజుల తండా గ్రామంలో ఓ నిండు గర్భిణి ఆస్పత్రికి చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద యుద్దమే చేశారు.

    వివరాలు.. రాజులతండా గ్రామానికి చెందిన తగిరే సరిత అనే నిండు గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అయితే గ్రామ శివారులో ఉన్న వాగు పొంగి ప్రవహిస్తుండటంతో.. ఆటో రాలేకపోయింది. దీంతో రాజులతండా నుంచి ఆమెను బంధువులు ఎడ్ల బండి సాయంతో వాగు దాటించారు. అయితే ఆ వాగు దాటించే సమయంలో ఎడ్లబండి సగం వరకు నీళ్లు చేరాయి. ఆ దారి కూడా చాలా భయానకంగా ఉంది.



    అయితే తీవ్రంగా శ్రమించిన బంధువులు ఎట్టకేలకు ఆమెను సురక్షితంగా వాగు దాటించారు. అనంతరం వాగు అవతలి వైపు సిద్ధంగా ఉన్న ఆటోలో ఆమెను నేరడికొండ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది గర్బిణి.. పరీక్షలు నిర్వహించి పరిస్థితి సమస్యాత్మకంగా ఉన్నట్టుగా గుర్తించారు. వారి సూచన మేరకు కుటుంబ సభ్యులు గర్భిణిని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Adilabad, Pregnant women, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు