హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kavitha Vs Sharmila: షర్మిల బీజేపీ వదిలిన బాణమా..? సీఎం కూతురు వర్సెస్ సీఎం చెల్లెలు..!

Kavitha Vs Sharmila: షర్మిల బీజేపీ వదిలిన బాణమా..? సీఎం కూతురు వర్సెస్ సీఎం చెల్లెలు..!

కవిత, షర్మిల

కవిత, షర్మిల

Sharmila Vs Kavitha: తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత, ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో చాలా రోజులుగా ఆమె పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఎప్పుడూ పెద్దగా వార్తల్లో లేరు. కానీ రెండు మూడు రోజులుగా ఆమె చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.  టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత  ఉమ్మడి వరంగల్‌లో టీఆర్ఎస్(TRS) శ్రేణులు షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేయడం, ఆ వాహనాలతో షర్మిల ప్రగతి భవన్‌ వైపు వెళ్లడం, ఆమె కారులో ఉండగానే.. పోలీసులు కారును లాక్కెళ్లడం.. అనంతరం అరెస్ట్ చేయడం.. వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో షర్మిల టార్గెట్‌గా టీఆర్ఎస్ లీడర్లు విరుచుకుపడుతున్నారు. నోరు అదుపులోపెట్టుకోకుంటే.. చూస్తూ.. ఊరుకోబోమని హెచ్చరించారు.

సిట్ విచారణకు భయమెందుకు..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాడీవేడీగా వాదనలు..విచారణ

తాజాగా ఈ అంశంపై  సీఎం కేసీఆర్ (CM KCR) కూతురు,  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అని.. ఆమె తానా అంటే కమలం నేతలు తందానా అంటున్నారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ ఇష్యూలోకి కవిత ఎంటర్ అవడంతో.. షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. ట్విటర్ వేదికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

మొదట షర్మిలను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. '' తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు''.  అని వ్యాఖ్యానించారు. షర్మిల పాదయాత్ర వెనక బీజేపీ ఉందని పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కవిత ట్వీట్‌పై షర్మిల్ కూడా తన దైన శైలిలో స్పందించారు. ప్రజా సమస్యలు పట్టవుగానీ.. కవితలకు మాత్రం కొదవలేదంటూ సెటైర్లు వేశారు.

''పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు.'' అని షర్మిల ట్వీట్ చేశారు.

6 నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు..వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

షర్మిల ట్వీట్‌పై మళ్లీ స్పందించిన కవిత.. ఈసారి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాను ఉద్యమం నుంచీ ప్రజల్లోనే ఉన్నానని.. మీలాగా రాజ్యం వచ్చాక రాలేదని విమర్శలు గుప్పించారు.

''అమ్మా.. కమల బాణం. ఇది మా తెలంగాణం. పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు. నేడు తెలంగాణ రూటు. మీరు కమలం కోవర్టు. ఆరేంజ్ ప్యారేట్టు. మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను. రాజ్యం వచ్చాకే రాలేదు నేను. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవిత ను నేను.''..  అంటూ కవితాత్మకంగా కౌంటర్ ఇచ్చారు కవిత.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత, ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

First published:

Tags: Kalvakuntla Kavitha, Telangana, YS Sharmila, Ysrtp