హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బీజేపీ గూటికి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు..? టీఆర్ఎస్‌కి బిగ్ షాక్ తప్పదా..!

Telangana: బీజేపీ గూటికి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు..? టీఆర్ఎస్‌కి బిగ్ షాక్ తప్పదా..!

KCR TRS(FILE)

KCR TRS(FILE)

Telangana: తెలంగాణ బీజేపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్, రాజేందర్‌ని.. ఆ పార్టీ కార్యకర్తలు RRRగా పిలుచుకుంటారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఎంపీ పేరు కూడా 'R' అక్షరంతోనే మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana)లో బీజేపీ దూకుడు పెంచుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కి మరింత పదును పెడుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (KomatiReddy Rajagopal Reddu)ని పార్టీలో చేర్చుకొని ఉపఎన్నికలను తీసుకొచ్చిన కాషాయ పార్టీ.. రానున్న రోజుల్లో మరికొంత మంది సిట్టింగ్‌లను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే ఒక ఎంపీని కూడా చేర్చుకొని.. లోక్‌సభ స్థానానికి కూడా ఉపఎన్నికలు తీసుకురావాలని భావిస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం గాలం వేస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ పెద్దలు మంతనాలు సాగిస్తున్నారు. వారిలో కొంత మంది కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఐతే ఎప్పుడు చేరతారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

తెలంగాణలో కొలువుల జాతర.. టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ .. మొత్తం ఖాళీలు 

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒకే ఒక్కరు గెలిచారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ (Raja Singh) విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి రఘునందన్ రావు (Raghunandan Rao) గెలుపొందారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ (Eatala Rajender) టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరడం, హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో... అసెంబ్లీలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. లోక్‌సభలో తెలంగాణ నుంచి నలుగురు సభ్యుల బలముంది. సికింద్రాబాద్ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐతే త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ రాజీనామా చేస్తారని సమాచారం. తమ పార్టీలోకి వచ్చే నేతలంతా పదవులకు రాజీనామా చేయాలని కమలం పెద్దలు కండిషన్ పెట్టడంతో..ఆ ఎంపీ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని.. వచ్చే ఏడాదిలో సదరు ఎంపీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఆయనతో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం కాషాయ గూటిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


తెలంగాణ బీజేపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్, రాజేందర్‌ని.. ఆ పార్టీ కార్యకర్తలు RRRగా పిలుచుకుంటారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఎంపీ పేరు కూడా 'R' అక్షరంతోనే మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బీజేపీలోకి రావాలనుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా 'R' అక్షరంతోనే మొదలవుతాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇలా బీజేపీకి Rసెంటిమెంట్ బాగా కలిసి వస్తోందని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా ఉండబోతున్నాయని.. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అక్కడ బీజేపీ విజయం సాధిస్తే.. టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులు, వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ రాదని భావిస్తున్న వారంతా.. కమలం గూటికి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.

First published:

Tags: Telangana, Telangana Politics, Trs

ఉత్తమ కథలు