Home /News /telangana /

TELANGANA POLITICS KHAMMAM TRS LEADER PONGULETI SRINIVAS REDDY LIKELY TO JOIN BJP ON 21ST AGUST SK

Telangana: టీఆర్ఎస్‌కి మరో కీలక నేత గుడ్‌బై? బీజేపీలో చేరేందుకు రెడీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ponguleti Srinivas Reddy: బీజేపీలో పొంగులేటి చేరిక ఖాయమైందని.. మునుగోడు సభలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన తన కూతురు రిసెప్షన్ ద్వారా దీనిపై మరింత స్పష్టత వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ని కాషాయదళం ముమ్మరం చేసింది. ఇప్పటికీ పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆగస్టు 21న మునుగోడు సభ (Munugodu Bypolls) వేదికగా మరికొంత మంది కీలక నేతల చేరికలు ఉండేలా వ్యూహాలకు పదును పెడుతోంది. హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఆ పార్టీ నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాషాయ దళంలోకి వెళ్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy). బీజేపీలో పొంగులేటి చేరిక ఖాయమైందని.. మునుగోడు సభలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన తన కూతురు రిసెప్షన్ ద్వారా దీనిపై మరింత స్పష్టత వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ వేడుక ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగింది. న భూతో: న భవిష్యత్ అన్నంత ఘనంగా రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. వందల ఎకరాల స్థలంలో.. వందల కోట్ల ఖర్చుతో... కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు లక్షలాది అతిథులు తరలి వచ్చారు. కూతురి రిసెప్షన్‌కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఇంత ఘనంగా నిర్వహించిన పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ కనిపించలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఐతే ఈ వేడుకలో ఈటల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పక్క పార్టీకి చెందిన ఈయన కనిపించారు గానీ.. సొంత పార్టీ నేతలెవరూ హాజరకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన బీజేపీలోకి వెళ్లనున్నారని.. అందువల్ల గులాబీ నేతలు హాజరవలేదని తెలుస్తోంది.



    పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరికకు అంతా సిద్ధం చేసుకున్నారని.. తన బల ప్రదర్శన చేసేందుకే లక్షలాది మందిని కూతురి రిసెప్షన్‌కు పిలిపించారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఆగస్టు 21న మునుగోడులో జరిగే జభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ సభా వేదికగానే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా కమలదళంలో చేరే అవకాశముందని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో పొంగులేటిని కాదని.. నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వడంతో.. టీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పొంగులేటి. అప్పటి నుంచీ గులాబీ దళంతో అంటీముంటనట్టుగా ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీలోకి వలసలు పెరగడంతో..ఆయన కూడా ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Khammam, Ponguleti srinivas reddy, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు