Home /News /telangana /

TELANGANA POLITICS CAN BE CHANGED OFTER ELECTIONS RESULT SAYS EEATALA RAJENDER VRY KNR

Eetala rajender : ఫలితాల తర్వాత తెలంగాణలో పెను మార్పులు..ఈటల

Eetala rajender : ఫలితాల తర్వాత తెలంగాణలో పెను మార్పులు..ఈటల

Eetala rajender : ఫలితాల తర్వాత తెలంగాణలో పెను మార్పులు..ఈటల

Eetala rajender : హుజూరాబాద్ లో ప్రజలు చరిత్రను తిరగరాశారని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలను పంపిణి చేసినా.. వేలాది కోట్ల జీవోలు, అధికార బలంతో సీఎం కెసిఆర్ ప్రభుత్వం చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.

ఇంకా చదవండి ...
  హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత వందల కోట్లు పంపిణీ, ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు చరిత్ర తిరగరాశారు. కరీంనగర్ గడ్డ చైతన్యవంతం అయినదని .. హుజూరాబాద్ అంతకంటే చైతన్యవంతమైనది అణచివేతను ఒప్పుకోదని అన్నారు... మా బిడ్డ మీద కెసిఆర్ దాడి చేస్తున్నారు.
  ధర్మం, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు.అక్రమ డబ్బు 500 కోట్లు పంచి పెట్టారు.వందలమంది పోలీసులు పని చేశారు. అయినా కెసిఆర్ ఫీజు పీకాలని ప్రజలు డిసైడ్ అయ్యారు.

  ఈ గడ్డ మీద ఉన్న అన్నీ సంఘాలు నా గెలుపులో భాగస్వామ్యమయ్యారు. తెరాసా నేతలు ఓటుకి 6 వేల రూపాయలు ఇచ్చారు. చివరికి ఓటుకి 10 వేలు ఇచ్చారు. పోలింగ్ సిబ్బందికి కూడా డబ్బులు ఇచ్చారు. ఈ దుర్మార్గాన్ని పత్రికలు, మీడియా ఆపలేక పోయింది. కానీ దానిని ప్రజలు నిలువరించేందుకు సిద్దమయ్యారని చెప్పారు...నాయకులు లేని దగ్గర ప్రజలే నాయకులు అయ్యారు. ప్రతి ఒక్కరూ గొప్పగా పని చేశారు. యువత, విద్యార్థులు శ్రమించి పని చేశారు.

  ఇది చదవండి : హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు పక్కా..! కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు..!


  దళితబంధు రాదు అన్నా కూడా భయపడలేదు. ఓటు కోసం ఇచ్చే డబ్బులు వదిలి పెట్టుకుని నా కోసం పనిచేశారని చెప్పారు..ఇక ప్రవాసభారతీయులు కూడా నన్ను గెలిపించాలని అహర్నిశలు కృషి చేశారని చెప్పారు.. మరోవైపు హైదరాబాద్ లో ఉన్న  వారిని టీఆర్ఎస్ నేతలు పిలిపించుకున్న కూడా వారు వచ్చి నాకు ఓటు వేశారని చెప్పారు. టీఆర్ఎస్ నిరంకుశత్వాన్ని బొంద పెట్టడంలో ప్రజలంతా ఏకమయ్యారు.

  ఇది చదవండి : తెలంగాణ విలీనం చేస్తానంటే తాను మద్దతు ఇస్తాను... కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు...?


  ఈ గెలుపును తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నానని ఈటల రాజేందర్ చెప్పారు.. ఈ క్రమంలోనే నవంబర్ 2 తరువాత యావత్ తెలంగాణలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని ఆయన చెప్పారు.. కానీ ఈటెల మీద ప్రేమ ముందు కేసీఆర్ కుట్ర ఓడిపోయిందని జితెందర్ రెడ్డి అన్నారు.. నవంబర్ 2 నుండి తెలంగాణ చరిత్ర మారబోతోంది.కెసిఆర్ కి గుణపాఠం తప్పదు. కష్ట పడి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Eetala rajender, Huzurabad By-election 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు