హోమ్ /వార్తలు /telangana /

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై దాడి.. జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఇదే..

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై దాడి.. జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఇదే..

Attack on Teenmar Mallanna: తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య వార్.. దాడులకు దారి తీసింది. ఆ రెండు పార్టీల మధ్య ఫైట్ తారాస్థాయికి చేరింది. తాజాగా క్యూన్యూస్ మీడియా పెట్టిన పోల్ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కొందరు ముసుగు ధరించిన వ్యక్తులు దాడి చేశారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇంకా చదవండి ...

    Attack on Teenmar Mallanna: తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా హింటించినట్టు.. ముందస్తు ఎన్నికల వాతావరణం అప్పుడే కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ మధ్య ముదిరిన మాటల యుద్ధం ఇప్పుడు భౌతిక దాడులకు దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన తీర్మాన్ మల్లనకు చెందిన క్యూన్యూస్ మీడియా ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్ తీవ్ర పరిణామాలకు బీజంగా మారింది. కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్‌ కారణంగా తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం పెల్లుబికింది. ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ తీన్మార్ మల్లన్న, బీజేపీపై నిప్పులు చెరిగారు. తాజాగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు. ఇక తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా.. అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి. అయితే తనపై భౌతిక దాడులు జరిగినా భయపడేది లేదని.. తాను తప్పు చేయనప్పుడు వెనక్కు తగ్గేదేలే అంటున్నారు మల్లన్న..

    క్యూన్యూస్ ఆఫీసులోకి మాస్కులతో ప్రవేశించిన కొందరు మల్లన్నపై నేరుగా దాడికి దిగారు. ఏం అనుకుంటున్నార్రా? అంటూ తోసుకుంటూ మీదికి వెళ్లారు. కాగా, తన ట్విట్టర్‌ను హ్యాక్ చేశారని తీన్మార్ మల్లన్న సమాధానం చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కొందరు వ్యక్తులు తీన్మార్ మల్లన్నపై సీరియస్ అవుతూ దాడికి వెళ్తుండగా ఆఫీసులోని ఇంకొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. అప్పటికే ఆ ప్రాంతంలో కొంత ఫర్నీచర్ ధ్వంసం అయినట్టు కనిపించింది. తన ట్విట్టర్ హ్యాక్ చేశారని తీన్మార్ మల్లన్న పదేపదే చెప్పారు. కాగా, ఇన్నాళ్లు తాము మీకు సపోర్ట్ చేశామని ఇంకొకరు వీడియో తీస్తున్నవారి వైపు నిలబడి అన్నారు. తీన్మార్ మల్లన్నపై దాడి చేసినవారు టీఆర్ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్నారు.

    ఈ వివాదం అంతటికి ప్రధాన కారణం క్యూన్యూస్ సంస్థ ట్విట్టర్ లో నిర్వహించిన పోలే.. అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా? అనే పోల్ ఈ వివాదానికి తెర తీసింది. అయితే ఈ ట్వీట్ తాను పెట్టలేదని.. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఇలాంటి ట్వీట్లు తాను పెట్టను అన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. ఎవరో ఈ పని చేసి ఉంటారని మల్లన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు..

    అంతకుముందు ఈ పోల్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగానే ఆయన తీన్మార్ మల్లన్నపై నిప్పులు చెరిగారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని కేటీఆర్ మండిపడ్డారు.

     బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (jp nadda) ఈ పోల్‌పై ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్‌ షా (amit shah) కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

    ఇక కేటీఆర్ కు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు, గులాబీ అభిమానులు వరుస ట్వీట్లతో మల్లన్నపై మాటల దాడి మొదెలెట్టారు. సోషల్ మీడియాలో వార్ జరుగుతుండగానే కొందరు దుండగులు క్యూన్యూస్ కార్యాలయంలోకి చొరబడి.. మల్లన్న అతడి అనుచరులపై దాడికి దిగారు. అయితే ఈ దాడిని బీజీపీ నేతలు ఖండిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.. ఇప్పటికే టీఆర్ఎస్-బీజేపీ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తాజా పరిణామం ఇక్కడితో ఆగేలా లేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తే.. భౌతిక దాడులు తప్పేలా లేవు.. పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యి చర్యలు తీసుకుంటే పర్వాలేదు.. లేదంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు