Home /News /telangana /

TELANGANA POLICE SPECIAL FOCUS ON DRUG TRANSPORT AND TAKING SERIOUS ACTION ON ACCUSED EVK

Telangana : "మ‌త్తు"పై ఉక్కుపాదం.. విస్తృతంగా పోలీసుల త‌నిఖీలు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఇటీవ‌లే ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుఖాన్ కొడుకు మ‌త్తు ప‌దార్థాల కేసులు ప‌ట్టుబ‌డ్డ ఘ‌ట‌న అంద‌రికీ తెలిసిందే. ఈ ఘ‌ట‌నతో దేశ‌వ్యాప్తంగా మ‌త్తు ప‌దార్థాల వాడ‌కం, యువ‌త త‌ప్పుదోవ ప‌డుతున్న వైనంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ ప‌లు చోట్ల‌ డ్ర‌గ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పోలీస్ శాఖ మ‌త్తు ప‌దార్థాల ర‌వాణా నియంత్ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది.

ఇంకా చదవండి ...
  - రఫీ, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న్యూస్ 18

  దేశ‌వ్యాప్తంగా మ‌త్తు ప‌దార్థాల వాడ‌కం.. డ్ర‌గ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ మ‌త్తు ప‌దార్థాల ర‌వాణాపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఎక్కువ‌గా ఆర్థికంగా ఉన్న‌త వ‌ర్గాలు.. సెల‌బ్రెటీల పిల్ల‌లు మ‌త్తు ప‌దార్థాలకు ఎక్కువ‌గా బానిస‌లుగా మారుతున్నారు. ఇటీవ‌లే ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుఖాన్ కొడుకు మ‌త్తు ప‌దార్థాల కేసులు ప‌ట్టుబ‌డ్డ ఘ‌ట‌న అంద‌రికీ తెలిసిందే. ఈ ఘ‌ట‌నతో దేశ‌వ్యాప్తంగా మ‌త్తు ప‌దార్థాల వాడ‌కం, యువ‌త త‌ప్పుదోవ ప‌డుతున్న వైనంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా ఎంజాయ్ డ్రగ్స్ కు అలవాటుపడిన యువత తరచూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి . అంతే కాకుండా మారుమూల ప్రాంతాల్లో గంజాయి వినియోగం పెరుగుతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

  ప్ర‌త్యేక బృందాల‌తో త‌నిఖీలు..
  దీంతో మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి కట్టుబడు తుండంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు దీంతోపాటు దసరా ఉత్సవాల సందర్భంగా రాకపోకలు పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు రాకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా స‌రిహ‌ద్దు జిల్లా అయిన మ‌హుబూబ్‌న‌గ‌ర్  జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు జిల్లా వారీగా 4 చెక్ పోస్ట్ లు 144 సిబ్బంది 12 తనిఖీ బృందాలు 10 నుంచి 12 సభ్యులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  ఎస్పీ పర్యవేక్షణ
  ఇటు కర్ణాటక అటు ఆంధ్రాతోపాటు పక్కనే ఉన్న హైదరాబాద్ నుంచి మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాకు మత్తు పదార్థాలు రవాణా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు అందుకని వ్యాపారులు జిల్లాను లక్ష్యంగా చేసుకుని తమ వ్యాపారం సాగించే అవకాశం ఉందని భావించి ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు పకడ్బందీగా చర్యలు చేపట్టారు వాహన తనిఖీలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు జిల్లా కేంద్రం శివారు బండమీదిపల్లి లో ఏర్పాటుచేసిన చెక్ పోస్టులు ఆయన పరిశీలించారు కర్ణాటక రాష్ట్రం నుంచి పట్టణంలో కి వచ్చే వాహనాల తనిఖీ పర్యవేక్షించారు గుట్కా ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తుండటంతో అటు జడ్చర్ల ఇటు బండమీదిపల్లి తనికి కేంద్రం వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు రహదారులతో పాటు జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే బస్టాండ్ . రైల్వే స్టేషన్ .రైతు బజార్ తదితర ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు..

  క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొంటాం..
  జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు అంతేకాక జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని మూడు రోజులపాటు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని ఎక్కడైనా ఎవరైనా నా మత్తుపదార్థాలను విక్రయించినట్లు తెలిసినా పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Drugs, Drugs case, Mahabubnagar, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు