తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కి తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. రేపు ప్రారంభం కాబోయే ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. రేపు నిర్మల్ జిల్లా భైంసా నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా..ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. శాంతి భద్రతల దృష్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సురేష్ ధ్రువీకరించారు. మరి దీనిపై బండి సంజయ్ (Bandi Sanjay) ఎలా స్పందిస్తారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ (Bandi Sanjay) నాల్గో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ (Kutbullapur) నియోజకవర్గంలోమొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు ముఖ్యఅతిధిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌బన్సాల్ హాజరయ్యారు. ఈ పాదయాత్ర పూర్తిగా హైదరాబాద్(Hyderabad)శివారు ప్రాంతాల్లో 9 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు కొనసాగింది. ఈ పాదయాత్రలో భాగంగానే బహిరంగ సభను నిర్వహించారు. అయితే ఆ సమయంలో మునుగోడు ఉపఎన్నిక (Munugodu Bypoll) షెడ్యూల్ రావడంతో 5వ విడత ఆలస్యం అయింది.
ఐదో విడత పాదయాత్ర ఇలా..
ఇక ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుండి కరీంనగర్ (Karimnagar) వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా..డిసెంబర్ 16,17న కరీంనగర్ లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ (Karimnagar) లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.
రేపు పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసుల అనూహ్య షాక్ తో బీజేపీ (Bjp) వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రేపు పాదయాత్ర ఉంటుందా లేక వాయిదా పడుతుందా అనేది చూడాలి. ఒకవేళ పోలీసుల అనుమతి నిరాకరణను కాదని బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్రను ఎలాగైనా చేపడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Bandi sanjay, Bjp, Hyderabad, Telangana