ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్‌లకు అంతా సిద్ధం... వీటిని తీసుకెళ్లడం అస్సలు మరవద్దు

ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమినరి పరీక్షలు)లో ఉత్తీర్ణత సాధించి, ఫిజికల్ టెస్ట్‌లకు అర్హల పొందిన అభ్యర్థులకు TSLPRB వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్ పొందుపరిచారు. ప్రవేశపత్రంలో దేహదారుఢ్య పరీక్షకు హాజరుకావలసిన తేదీ, వేదిక, ఇతర వివరాలను పేర్కొన్నారు.

news18-telugu
Updated: February 10, 2019, 11:37 PM IST
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్‌లకు అంతా సిద్ధం... వీటిని తీసుకెళ్లడం అస్సలు మరవద్దు
ఏపీ ఎస్సై ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్
  • Share this:
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా సోమవారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మూడు కేంద్రాలు, మిగిలిన ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా మైదనాల్లో ఫిజికల్ టెస్ట్‌ల కోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశారు. ఎస్సీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమకు కేటాయించిన గ్రౌండ్‌లో ఉదయం 5 గంటల లోపు ఖచ్చితంగా హాజరుకావలసి ఉంటుంది. ఆలస్యమైన వారికి అనుమతి ఉండదు.

ఫిట్‌నెస్ టెస్ట్‌లో ప్రతి అభ్యర్థి ఛాతీ, ఎత్తు, బరువును నమోదుచేస్తారు. అనంతరం హైజంప్, లాంగ్ జంప్, 100 మీ, 800 మీటర్ల పరుగులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు. దేహదారుఢ్య పరీక్షలలో ఎలాంటి పైరవీకారులకు తావులేదని...పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. ఆధునిక పరిజ్ఞానంతో పకడ్బంధీగా పరీక్షల నిర్వహణ ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలపై సీసీ కెమెరా, వీడియో పర్యవేక్షణతో నిఘా ఉంటుందని స్పష్టంచేశారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్స్, ఆభరణాలు, అధిక మొత్తంలో డబ్బు, లగేజికి అనుమతి ఉండదని...అలాంటి వస్తువులు వెంట తెచ్చుకోకూడదని సూచించరు.

కాగా, ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమినరి ఎగ్జామ్)లో ఉత్తీర్ణత సాధించి, ఫిజికల్ టెస్ట్‌లకు అర్హల పొందిన అభ్యర్థులకు TSLPRB వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్ పొందుపరిచారు. అభ్యర్థులంతా అడ్మిట్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రవేశపత్రంలో దేహదారుఢ్య పరీక్షకు హాజరుకావలసిన తేదీ, వేదిక, ఇతర వివరాలను పేర్కొన్నారు.

అభ్యర్థులు వెంట తీసుకురావాల్సిన పత్రాలు ఇవే
1. ఫిజికల్ టెస్ట్ అడ్మిట్ కార్డ్
2. పార్ట్-2 రిజిస్ట్రేషన్ ప్రింట్ అవుట్
3. కుల ధృవీకరణ పత్రం జిరాక్స్

4. ఎక్స్ సర్వీస్‌మెన్/నో అబ్జెక్షన్ సర్టిఫికెట్
5. ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ (ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే)

ఉదయం గ్రౌండ్‌లోకి ఎంటరైన తర్వాత బయటకు వెళ్లగానికి వీలుపడదు. ఈ నేపథ్యంలో ఫిజికల్ టెస్ట్‌లకు వెళ్లే అభ్యర్థులు తమ వెంట బాదం, జీడిపప్పు, ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్, వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచింది. మీ దేహదారుఢ్య పరీక్ష రోజులో ఏ సమయంలోనైనా జరగొచ్చు. అందుకే అప్పటి వరకు శక్తి కోల్పోకుండా ఉండేందుకు ఈ ఎండు ఫలాలు ఉపయోగపడతాయి.
Published by: Shiva Kumar Addula
First published: February 10, 2019, 10:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading