హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS sharmila : నిరుద్యోగి పరామర్శకు వెళ్లిన వైఎస్ షర్మిలకు షాక్...!

YS sharmila : నిరుద్యోగి పరామర్శకు వెళ్లిన వైఎస్ షర్మిలకు షాక్...!

YS sharmila : నిరుద్యోగి పరామర్శకు వెళ్లిన వైఎస్ షర్మిలకు షాక్...!

YS sharmila : నిరుద్యోగి పరామర్శకు వెళ్లిన వైఎస్ షర్మిలకు షాక్...!

YS sharmila : ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది...ఇటివల ఉద్యోగం కోసం ఆత్మహత్యా యత్నం చేసిన ఓ యువకుడిని పరామర్శించేందుకు వెళ్లిన ఆమెకు చుక్కెదురైంది.. తాను పరామర్శించాల్సిన యువకుడితోపాటు అతని తండ్రి కూడా ఆ ఇంట్లో లేరు.. దీంతో ఆమె ఖంగుతింది..అయితే ఇదంతా పోలీసుల పనేనంటూ షర్మిల అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి ...

గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల తెలంగాణ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారు. రాజకీయంగా   నిలదొక్కుకునేందుకు ముందుగా ఆమె నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా తెరపైకి తెస్తున్నారు. దీంతో పార్టీ ప్రారంభానికి ముందే..నిరుద్యోగ యువత కోసం నిరహార దీక్ష చేశారు. అనంతరం పలు చోట్ల ఆందోళనలు కూడా నిర్వహించారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో ఉద్యోగం కోసం వేచి చూసి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను   పరామర్శిస్తుంది. ఇలా ఇప్పటికే షర్మిల పలు జిల్లాల్లో పర్యటిస్తోంది.ఈ సంధర్భంలోనే యువతకు ధైర్యం చెబుతూనే సీఎం కేసిఆర్‌పై విరుచుకుపడుతోంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుతోంది.

అయితే ఈ రోజు పరామర్శకు వెళ్లిన షర్మిలకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. పరామర్శకు వస్తున్న షర్మిలకు ఆ కుటుంబ సభ్యులనే కలువకుండా చేశారు.. వివరాల్లోకి వెళితే.. నేడు సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ మండలానికి చెందిన సాయి అనే యువకుడు ఉద్యోగం రాలేదంటూ ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు.. దీంతో సాయి పరామర్శించేందుకు నేడు వైస్ షర్మిల వెళ్లింది...

కాని పరామర్శించాల్సిన యువకుడు మాత్రం ఆ ఇంట్లో లేడు ...తల్లి మాత్రం ఇంట్లోనే ఉంది. సాయి కోసం ఎంక్వయిరి చేయడంతో తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్లాడనే సమాధానాన్ని సాయి తల్లి చెప్పింది. అయితే వైఎస్ షర్మిల అభిమానులు మాత్రం ఇదంతా పోలీుసుల పనేనంటూ విమర్శలు చేశారు..వారిని కలవకుండా బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు...

దీంతో చేసేదేమి లేక వైఎష్ షర్మిల వెనుదిరిగింది. అనంతంర నల్గొండ జిల్లాలోని సలీం అనే అభిమాని కరోనాతో మృతి చెందడంతో ఆయన కుటంబాన్ని పరామర్శించారు. సాధారణంగా పరామర్శకు వెళుతున్న వ్యక్తి ఇంటికి ముందే సమాచారం ఇచ్చి.. ఆతర్వాత పార్టీ కార్యకర్తలు అనుచరులు మిగతా వ్యవహరాలను చక్కదిద్దుతారు. కాని ఇక్కడ అసలు వ్యక్తి లేకపోవడం వెనక రాజకీయ కోణం ఎమైనా ఉందా..లేదంటే షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నట్టుగా తెలంగాణ పోలీసులు యువకున్ని కలవకుండా బెదిరింపులకు గురి చేశారా లేక సాధారణంగానే యువకుడికి ఎలాంటీ సమాచారం లేకుండా షర్మిల అనుచరులు పరామర్శకు వెళ్లారా అనేది తేలాల్సి ఉంది.

First published:

Tags: Nalgonda police, YS Sharmila

ఉత్తమ కథలు