హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రేమికులకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు... కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రేమికులకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు... కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ పోలీసులు, వీహెచ్‌పీ ఆందోళనలు

హైదరాబాద్ పోలీసులు, వీహెచ్‌పీ ఆందోళనలు

Valentines Day : ప్రేమికుల రోజు వస్తుందంటే చాలు తెలంగాణ పోలీసులకు కొత్త తలనొప్పులు తప్పవు. ఈసారీ అదే జరుగుతోంది. హైదరాబాద్‌లో పార్కులన్నీ పోలీసుల కంట్రోల్‌లోకి వెళ్లిపోయాయి.

  ప్రేమికుల రోజు జరుపుకోవడానికి వీల్లేదు... అది మన కల్చర్ కాదు... లవర్స్ డే రోజున జంటగా కనిపిస్తే పెళ్లి చేసేస్తాం... అంటూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సంస్థలు హెచ్చరించాయి. నిరసనల్లో భాగంగా... వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు... అబిడ్స్‌లోని జీపీఓ చౌరస్తా దగ్గర ఆందోళనలు చేస్తూ... దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఆ తర్వాత మేడ్చల్‌లో ఓ ప్రేమ జంటకి పెళ్లి చేసేశారు. CMR కాలేజ్ ఎదురుగా ఉన్న కండ్లకోయ పార్కులో  ప్రేమ జంట తిరుగుతుండగా వాళ్లకు బలవంతంగా పెళ్లిచేశారు. దాన్ని మొబైల్‌లో వీడియో తీసారు. దాంతో ఆ జంట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు మొదలుపెట్టారు. వీడియో ఆధారంగా వాళ్లను పట్టుకుంటామంటున్నారు.


  తమ స్వేచ్ఛను హరించడానికి వాళ్లెవరు... తాము వాలెంటైన్స్ డే జరుపుకుంటే... వీహెచ్‌పీకి ఎందుకంత మంట... అంటూ ప్రేమికులు తిరగబడుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఎలాంటి ఆందోళనలూ, హింసాత్మక పరిస్థితులూ జరగకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ప్రేమికులు బాగా ఇష్టపడే ఇందిరా పార్క్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆ తర్వాత సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ మొత్తాన్నీ పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. లవర్స్ టెన్షన్ పడొద్దు. మీకు మేం అండగా ఉన్నాం అంటూ... సెక్యూరిటీ కల్పిస్తున్నారు.


  వాలెంటైన్స్ డే నాడు లవర్స్ పై ఎవరైనా దాడి చేసినా, పెళ్లి చేసేందుకు యత్నించినా తాట తీస్తామంటున్నారు పోలీసులు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్లైనా సరే... జైల్లో పెట్టి తీరతామని హెచ్చరిస్తున్నారు. ప్రేమికుల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదంటున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టుల్లో తేల్చుకోవాలే తప్ప... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడటం వంటివి చేస్తే తిక్క కుదుర్చుతామంటున్నారు పోలీసులు. సో... లవర్స్ డే ప్రేమికులదే. విదేశీ కల్చర్ అంటూ అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు.


   


  Video : ప్రేమికులకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు... కేసు నమోదు చేసిన పోలీసులు  Video : తూర్పు గోదావరి జిల్లాలో చిరుత పులి... ముగ్గురిపై దాడి చేసి చెట్టెక్కింది

  First published:

  Tags: Valentines day, VHP

  ఉత్తమ కథలు