Home /News /telangana /

TELANGANA POLICE FOIL DRUNKEN MAN SUICIDE ATTEMPT AND SAVES LIFE IN MANCHERIAL SU

Telangana Police: పరుగులు తీసి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. భుజాలపై మోసి మానవత్వం చాటారు.. అసలేం జరిగిందంటే..

మానవత్వం చాటుకున్న తెలంగాణ పోలీసులు

మానవత్వం చాటుకున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.

    తెలంగాణ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి.. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ క్రమంలోనే సీఐ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల‌లో చోటుచేసుకుంది. వివరాలు.. మంచిర్యాలలో రాజీవ్‌నగర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ కొంతకాలంగా మద్యానికి బానిసగా మారాడు. నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. మంగళవారం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన లక్ష్మీ నారాయణ.. తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే ఈ విషయాన్ని డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు తెలియజేశారు. లక్ష్మీ నారాయణను కాపాడాలని వేడుకున్నారు.

    దీనిపై వెంటనే స్పందించిన సీఐ ముత్తి లింగయ్య.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లక్ష్మీ నారాయణ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అయితే లక్ష్మీ నారాయణ రైలు పట్టాలపై ఉండటం.. అక్కడికి వాహనాలు వెళ్లేందుకు మార్గం కూడా లేదు. దీంతో సీఐ లింగయ్య, ఎస్‌ ప్రవీణ్‌తో పాటు సిబ్బంది పరుగులు తీస్తూ అక్కడికి చేరుకున్నారు. అతడు మద్యం తాగి ఉండటంతో.. పోలీసులు ఎంత చెప్పిన అక్కడి నుంచి రావడానికి నిరాకరించాడు. దీంతో సీఐ గన్‌మెన్ భరత్.. అతడిని భుజాలపై మోసుకొచ్చారు. అనంతరం అతడికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆస్పత్రిలో చేర్పించారు.





    అయితే లక్ష్మీనారాయణను కాపాడే క్రమంలో సీఐ లింగయ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోటి సిబ్బంది సీఐని.. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Mancherial, Telangana Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు