హోమ్ /వార్తలు /తెలంగాణ /

తూచ్.. ఆయన కాదు, ఖమ్మం ఏసీపీ పోస్టింగ్ పై కన్ఫ్యూజన్

తూచ్.. ఆయన కాదు, ఖమ్మం ఏసీపీ పోస్టింగ్ పై కన్ఫ్యూజన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఖమ్మం ఏసీపీ గా బి. రామానుజం ను నియమిస్తూ ఈరోజు డీజీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే తూచ్.. అంటూ బి. ఆంజనేయులుకు పోస్టింగ్ ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

ఓ ఉద్యోగిని నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేలోపే మళ్లీ పోలీసు శాఖ నుంచి కొత్త ఆదేశాలు వచ్చాయి. తూచ్ ఆయన కాదు. మరొకరు అక్కడ నియమితులైనట్టు కొత్త ఆర్డర్స్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే అధికారులు తూచ్ అనేశారు. అసలు విషయానికి వస్తే ఖమ్మం ఏసీపీ గా బి. రామానుజం ను నియమిస్తూ ఈరోజు డీజీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే తూచ్.. అంటూ బి. ఆంజనేయులుకు పోస్టింగ్ ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇంతలోనే ఏం జరిగిందోనని అందరూ పొలిటికల్ ఈక్వేషన్స్ లో మునిగిపోయారు. వాస్తవానికి మొదటి పోస్టింగ్ ఆర్డర్ లోని తప్పును సరిచేస్తున్నామంటూ తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. మొత్తానికి పోలీసు వర్గాలలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. అసలు దీని వెనుక ఏం జరిగింది. రామానుజం వద్దన్నారా? లేకపోతే ఆంజనేయులు కావాలన్నారా? దీని వెనుక ఏదైనా రాజకీయం జరిగిందా? లేకపోతే కేవలం ఆఫీసులో జరిగిన పొరపాటు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.

ఖమ్మం ఏసీపీగా ఆంజనేయులును నియమిస్తూ జారీ అయిన ఉత్తర్వులు

First published:

Tags: Khammam, Telangana, Telangana Police

ఉత్తమ కథలు