హోమ్ /వార్తలు /తెలంగాణ /

Police firing : పోలీసుపైకి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన గంజాయి స్మగ్లర్లు, పోలీసుల కాల్పులు.. 20 మంది గ్యాంగ్ అరెస్ట్

Police firing : పోలీసుపైకి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన గంజాయి స్మగ్లర్లు, పోలీసుల కాల్పులు.. 20 మంది గ్యాంగ్ అరెస్ట్

Police firing : పోలీసుపైకి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన గంజాయి స్మగ్లర్లు,

Police firing : పోలీసుపైకి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన గంజాయి స్మగ్లర్లు,

Police firing : గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు దిగిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా పక్కా సమాచారంతో విశాఖ ఎజెన్సితో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో దాడులు కొనసాగించి సమారు 1500 కిలోల గంజాయితో పాటు ఇరవై మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...

  గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు దిగిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా పక్కా సమాచారంతో విశాఖ ఎజెన్సితో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో దాడులు కొనసాగించి సమారు 1500 కిలోల గంజాయితో పాటు ఇరవై మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

  విశాఖ ఏజెన్సీ, ( vizag ) ఒడిశా సరిహద్దు ప్రాంతాలే కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాపై నల్లగొండ పోలీసులు ( Nalgonda police ) ఉక్కుపాదం మోపారు. ఏవోబీ లో ( AOB ) భారీ గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించి దాడులు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక బృందాల దాడిలో 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది..

  అయితే అరెస్టు చేసిన వారిని తీసుకొస్తున్న క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపై కొందరు స్మగ్లర్లు రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో పోలీస్‌ వాహనం ధ్వంసం కాగా, ఇద్దరు స్మగ్లర్ల కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది..

  ఇది చదవండి : నొప్పులకు మందులు ఇస్తానని ఆమెను గుడిసెలోకి తీసుకువెళ్లాడు.. ఆగకుండా.. ఆమెపై... !


  కాగా హైదరాబాద్‌లోని ( Hyderbad ) సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారీపై జరిగిన అత్యాచారానికి ( rape ) మూల కారణం గంజాయి తో పాటు ఇతర మత్తు పదార్థాలుగా తేలడంతో తెలంగాణ పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ( PD act)సైతం పెడుతుండడంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల నుండి వస్తున్న గంజాయిని కట్టడి చేసేందుకు పకడ్బద్ది చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్న ఆంధ్ర ,ఓడిశా సరిహద్దులతో పాటు ఏపిలోని ఇతర జిల్లాల నుండి గంజాయి స్మగ్లింగ్ అవుతుండడంతో ఏపీ రాష్ట్ర పోలీసులు సహాకారం కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సమచారం ఉండడంతో నల్గొండ పోలీసులు ఇరవై మందిని అరెస్ట్ చేశారు. వారితోపాటు 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

  ఇది చదవండి :  అక్టోబరు 18 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.


  వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ కీలక స్మగ్లర్‌ ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పోలీసులు పక్కా వ్యూహం సిద్ధం చేసుకుని, గంజాయి సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, హైదరా బాద్‌ ప్రాంతాల్లోని వ్యక్తులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరితో గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యులకు ఫోన్‌ చేయించారు. ఈ క్రమంలోనే వారిని పట్టుకునేందుకు ప్లాన్ ( plan ) వేశారు. అయితే అరెస్ట్ తర్వాత స్మగ్లర్లు పోలీసులపై దాడులు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గాల్లోకి కాల్పులకు జరిపినట్టు నల్గొండ జిల్లా ( nalgonda sp ) ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Ganja case, Nalgonda police

  ఉత్తమ కథలు