గాంధీభవన్ దగ్గర ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడ ఆందోళన చేస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను అర్థరాత్రి 2 గంటలకు పోలీసులు అరెస్టు చేసి తరలించారు. అరెస్టైన వారిలో మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. NSIU అధ్వర్యంలో వందల మంది అభ్యర్థులు నిన్న గాంధీభవన్ దగ్గరకు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1600 / 800 మీటర్లు క్వాలిఫై అయిన తమకు మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టారని మండిపడ్డారు. పాత పద్ధతిలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో... వీరు గాంధీభవన్‌ను ముట్టడించే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అభ్యర్థులు మాత్రం.. తాము ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే.. బలవంతంగా తరలిస్తున్నారనీ.. ప్రభుత్వం తమ భవిష్యత్తును కాలరాస్తోందని ఆరోపించారు. ఇలా రాత్రి 2 గంటల సమయంలో గాంధీభవన్ దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.