హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : బతుకమ్మను పేర్చే ఆ పువ్వులు కనుమరుగైపోయాయి.. కర్నాటక నుంచి తెప్పిస్తున్నారంట

Telangana : బతుకమ్మను పేర్చే ఆ పువ్వులు కనుమరుగైపోయాయి.. కర్నాటక నుంచి తెప్పిస్తున్నారంట

Bathukamma Flowers

Bathukamma Flowers

Telangana: మెదక్ జిల్లా వాసులు బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరిచూపూ మళ్లేది ఒక పువ్వుమీదికే. తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వులు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Medak, India

  (K.Veeranna,News18,Medak)

  బతుకమ్మ(Bathukamma)పండుగ వచ్చిందంటే అందరి చూపూ మళ్లేది ఆ పువ్వు పై మహిళలు ఆడపడుచు దృష్టి పెడతారు తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణ(Telangana)లో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వు ' గునుక పువ్వు(Ganuka flowers) తెలతెలవారుతుండగా మంచుబింధువులను మోస్తూ భానుడి లేలేత కిరణాలకు సింగిడి రంగులను ప్రతిబించించే గునుగు పువ్వు అంటే తెలంగాణలో తెలియనివారు ఉండరు.రాష్ట్రంలో బీడు భూములు సైతం సాగులోకి రావడంతో గునుగు పువ్వులు కనుమరుగవుతున్నాయి. దీంతో కర్ణాటక(Karnataka)నుంచి తీసుకొస్తున్నారు.

  Telangana: ప్రైవేట్‌ ఆసుపత్రుల దందాపై సర్కారు కొరడా .. ఆ జిల్లాలో ఎన్నింటికి నోటీసులిచ్చారంటే ..

  గనుక పువ్వుల కరువు..

  మెదక్ జిల్లా వాసులు బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరిచూపూ మళ్లేది ఒక పువ్వుమీదికే. తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వు గునుగు పువ్వు తెలతెలవారుతుండగా మంచుబింధువులను మోస్తూ భానుడి లేలేత కిరణాలకు సింగిడి రంగులను ప్రతిబించించే గునుగు పువ్వు అంటే తెలంగాణలో తెలియనివారు ఉండరు. దసరా నవరాత్రుల్లో 9 రోజులపాటు తెలంగాణలో ఏ వీధిలో చూసినా గునుగుపూల దిబ్బలే దర్శనమిస్తాయి.

  పుష్కలంగా ఉండే పువ్వులు మాయం..

  ముఖ్యంగా ఒకప్పుడు గ్రామాల్లో గునుగు పువ్వుకే రకరకాల రంగులు అద్ది బతుకమ్మలు పేర్చేవారు. నాడు ఊరు దాటగానే వయ్యారంగా ఊగుతూ పలకరించిన గునుగు పూలు.నేడు కిలోమీటర్ల దూరం తిరిగినా  కనిపించటంలేదు. అందుకు కారణం రాష్ట్రంలో బీడుభూములు లేకపోవటమే కారణం. అన్నీ పంట పొలాలే ఉన్నాయి. గునుగు పెరగాలంటే బీడు భూములు కావాలి. గతంలో పంట పోలలో  కందుల సజ్జ, జొన్న, ఆముదం పంటలు వేస్తే అందులో అసలు పంటలకంటే గునుగే ఎక్కువ పెరిగేది. నీరు అధికంగా పంటలకంటే గునుగే ఎక్కువ పెరిగేది. నీరు అధికంగా ఉన్నచోట గునుగు పెరగదు.

  సాగు భూమి పెరగడం వల్లే ..

  సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన 95 శాతం భూమి నేడు పంటపొలంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తుండటంతో పుష్కలమైన నీటి వసతి ఏర్పడింది. దీంతో రైతులు వరి, పత్తి వంటి పంటలే వేస్తుండటంతో చూద్దామన్నా బీడు భూములు కనిపించటంలేదు. ఫలితంగా గునుగు పువ్వు కనిపించకపోవడంతో. బతుకమ్మలు పేర్చేందుకు గునుగు పూలకోసం ఊర్లకు ఊర్లు దాటి పోవాల్సి వస్తున్నది.

  Telangana : అభాగ్యులు, అనాథలే వాళ్లకు ఆత్మీయులు .. 11ఏళ్లుగా వాళ్ల కోసం ఏం చేస్తున్నారో తెలుసా..?

  కర్నాటక నుంచి దిగుమతి..

  మెదక్  జిల్లా వాసులైతే రాష్ట్రమే దాటిపోయి గునుగు పూల మోపులు తెచ్చుకొంటున్నారు. మెదక్ జిల్లా వరప్రదాయినిగా ఉన్న సింగూరు ప్రాజెక్టు నీటిని ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ వాసులకు తాగునీటి కోసం అందించేవారు. ప్రస్తుతం ఆ నీటిని మెదక్ జిల్లాకే అందిస్తుండటంతోపాటు కాళేశ్వరం నీరు సైతం మెతుకు సీమను తడుపుతున్నది. దీంతో ఎక్కడ చూసినా వరి పొలాలే దర్శనమిస్తున్నాయి. బీడుభూములు కనుమరుగయ్యాయి. గునుగు పువ్వు దొరక్కపోవటంతో జిల్లాలోని  100 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోగల బీదర్ సమీపానికి వెళ్లి పువ్వు తీసుకొస్తున్నారు. ఇప్పుడు బతుకమ్మ బంతిపూలు చేమంతి పూలతో పాటు లిల్లీ పూలు, ఎర్రని పూలు మార్కెట్లో కొనుగోలు చేసే బతుకమ్మను పేరుస్తున్నారు. గ్రామాల్లో గునుక పువ్వుతో బతుకమ్మను పేరిస్తే ఎవరిది ఎంతో పెద్దగా పేర్చారో ఆ బతుకమ్మను చూసి మహిళలు ఆశ్చర్యపోయేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో చిన్న బతుకమ్మలను తయారు చేసి పండుగ సంబురాలు జరుపుకుంటున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Medak, Telangana News

  ఉత్తమ కథలు