తెలంగాణ ఉద్యోగులకు నిరాశ... పీఆర్సీ గడువు పెంచిన ప్రభుత్వం

పీఆర్సీ నుంచి సరైన స్పందన రాలేదు... దీంతో, ప్రభుత్వాన్ని కలిసిన ఉద్యోగ సంఘాలు... కనీసం మధ్యంతర భృతినైనా ప్రకటించాలని విజ్ఞప్తి చేశాయి.

news18-telugu
Updated: February 18, 2020, 3:52 PM IST
తెలంగాణ ఉద్యోగులకు నిరాశ...  పీఆర్సీ గడువు పెంచిన ప్రభుత్వం
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. పీఆర్సీ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్ల నుంచి పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు... ప్రభుత్వం కనీసం మధ్యంతర భృతినైనా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, ఆ వైపుగా ఎలాంటి చర్యలు తీసుకోని సర్కార్... పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) గడువును పెంచుతూ వస్తోంది. మరోవైపు, గత నవంబర్‌లో పీఆర్సీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సర్కార్.  10... 15 రోజుల్లోగా పీఆర్సీ నివేదికను ఇవ్వాలని చెప్పింది. అయినప్పటికీ పీఆర్సీ నుంచి సరైన స్పందన రాలేదు... దీంతో, ప్రభుత్వాన్ని కలిసిన ఉద్యోగ సంఘాలు... కనీసం మధ్యంతర భృతినైనా ప్రకటించాలని   విజ్ఞప్తి చేశాయి.

అయితే, పీఆర్సీ నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశిస్తూ వచ్చింది తప్ప... వెంటనే పీఆర్సీని అమలు చేస్తామని చెప్పలేదు. ఇక, ఈ నేపథ్యంలోనే పీఆర్సీని గడువును పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఏప్రిల్ 1వ తేదీ నుంచైనా కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు