Home /News /telangana /

Telangana: వైద్యుల‌కే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడు.. రోజురోజుకూ పెరుగుతున్న తల.. ఆప‌న్న‌హ‌స్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

Telangana: వైద్యుల‌కే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడు.. రోజురోజుకూ పెరుగుతున్న తల.. ఆప‌న్న‌హ‌స్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

బాలుడితో తల్లిదండ్రులు

బాలుడితో తల్లిదండ్రులు

ఆ ఐదేళ్ల బాలుడి బాబు స‌మ‌స్య వైద్యుల‌కు సైతం అంతుచిక్క‌డం లేదు. వైద్యులే ఆపరేషన్ చేయడం వీలు కాదని అంటున్నారు. అయినప్పటికీ ఆ పేద త‌ల్లిదండ్రులు పిల్లాడి ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌డ‌రాని ప‌ట్లు ప‌డుతున్నారు.

  ఓ జంట‌కు ఇద్ద‌రు క‌వ‌ల‌ల పిల్ల‌లు పుట్టారు.. ఒక‌రు చ‌నిపోగా మ‌రో బాబును ప్రేమ పెంచుకుంటున్నారు. అయితే తాము ఓక‌టి త‌లిస్తే దైవం ఓక‌టి త‌ల‌చిన‌ట్టుగా ఆ బాబు పుట్టిన ఐదు నెల‌ల నుంచి త‌ల బాగం పెరగడం మొదలుపెట్టింది. ఐదేళ్లుగా ఆ బాబు ఆవ‌స్థను చూసి త‌ల్లిదండ్రులు ప‌డుతున్న క‌ష్టం వ‌ర్ణ‌నాతీతంగా ఉంది. ఆ బాబు స‌మ‌స్య వైద్యుల‌కు సైతం అంతుచిక్క‌డం లేదు.. అయినప్పటికీ పేద త‌ల్లిదండ్రులు పిల్లాడి ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌డ‌రాని ప‌ట్లు ప‌డుతున్నారు. వివరాలు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీకాంత్ హారిక దంప‌తుల‌కు 2016 మార్చి 1న ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.. ఏడు నెల‌ల‌కే పుట్ట‌డంతో ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేక‌ 41 రోజులకు కన్నుమూశాడు. మ‌రో బాబును ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ బాబుకు ముద్దుగా శివయ్య అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆ బాబుకి ఐదు నెలల నుంచి తల భాగం అనూహ్యంగా పెరగడం మొదలైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాబుకు వైద్యం అందించేందుకు ఆసుపత్రుల చూట్టు తిరిగారు. బాబుకు వైద్యం అందించేంద‌కు ఏ డాక్టర్ స‌హ‌సం చేయాలేదు. కొన్నిఆసుప‌త్రుల్లో స్కానింగ్, సీటి స్కాన్ చేసిన వైద్యులు కొన్ని మందులు రాసి ఇచ్చారు. వాటిని వాడిన ఫ‌లితం లేదు. రోజు రోజుకు తల‌లో నీరు చేరి తల భాగం పెరుగుతుంది. తల భారంగా మారి బాలుడికి అవస్థఎక్కువైంది. దీంతో ఆ పేద కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్న హైద‌రాబాద్ ఆసుప‌త్రికి తీసుకు వెళ్లారు. అక్క‌డ కూడా స‌మ‌స్య‌ను గుర్తించ‌లేక పోయారు.

  చివ‌ర‌కు సికింద్రాబాద్‌లోని గాందీ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. బాబు ప్రాణాల‌ను కాపాడాలని అక్కడి వైద్యులను ప్రాధేయపడ్డారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయడం వీలు కాదని.. చేసిన ప్రయోజనం ఉండదన్నారు. ఉన్నంత కాలం బాగా చూసుకోమని చెప్పి పంపించి వేశారు. ఏం జరిగినా పర్వాలేదు ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడ్డ వేడుకున్న వైద్యులు స‌సేమిరా అన్నారు.

  ఐదేళ్ల బాలుడు శివయ్యకు తల పెరిగి భారంగా మారడంతో పాటు కళ్ళు సరిగ్గా కనిపించవు. కాళ్లు, చేతులు కూడా సక్రమంగా పనిచేయవు. నిల‌బ‌డే అవకాశం లేకపోయింది. దీంతో త‌ల్లిదండ్రులు ఎత్తుకోవడం లేదా పడుకోబెట్టడం చేస్తున్నారు. ఆహారం కూడా ఏది తినడు ద్రవరూపంలో ఆహారం అందిస్తేనే జీర్ణమవుతుంది.. కుటుంబ సభ్యులు అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే బ‌లామృతం ఇస్తున్నారు. ఇదే ప్రతి రోజూ ఆహారంగా తీసుకుంటున్నాడు. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చిన ఏ డాక్టర్ వైద్యం అందించడం లేదని కనీసం మందులు కూడా రావడం లేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


  ఇక, శ్రీకాంత్, హారిక దంపతులకు మరో సంతానం కలిగింది. ఆ తర్వాత జన్మించిన బాబుకు ఇప్పుడు మూడేళ్ల. ఆ బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే శివయ్యకు వచ్చిన వ్యాధిని నయం చేయడానికి అప్పులు చేసి, బంగారం అమ్మి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చికిత్స కోసం ఎనిమిది లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.. వీరిది రేక్క‌డితే గాని డొక్కాడని పేద కుంటుంబం అయినప్పటికీ.. కొడుకును బతికించుకోవాలని తమ వంతు ప్రయత్నం చేశారు. అయితే 8 లక్షలు అప్పుచేసి.. ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేకుండా పోయింది. ఈ పరిస్థితి లో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆప‌న్న‌హ‌స్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్ర‌భుత్వం స్పందించి బాబుకు స‌రైన వైద్యం అందించి బాబు ప్రాణాలు కాపాడాల‌ని వేడుకుంటున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Nizamabad, Telangana

  తదుపరి వార్తలు