• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA PARAKALA MAN DIED IN AMERICA AFTER FIRE BROKE OUT IN CAR SU

Telangana: విషాదం నింపిన అమెరికా పర్యటన.. అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు ఒక్కసారిగా..

Telangana: విషాదం నింపిన అమెరికా పర్యటన.. అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు ఒక్కసారిగా..

ప్రతీకాత్మక చిత్రం

కొడుకును చూసేందుకు వెళ్లిన ఆ దంపతుల జీవితంలో తీరని విషాదం నెలకొంది. అక్కడ జరిగిన ప్రమాదంలో కొడుకు కళ్లముందే తండ్రి మృతిచెందాడు.

  • Share this:
    అతను ఓ ప్రభుత్వ ఉద్యోగి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొడుకు దగ్గరికి భార్యతో కలిసి వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడ సరదాగా గడిపాడు. కానీ అంతలోనే తీరని విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ఈదునూరి రాజమౌళి హన్మకొండలో నివాసం ఉంటున్నారు. అతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. అతని చిన్న కుమారుడు పవన్‌కుమార్ అమెరికాలోని మిచిగాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కుమారుడుని చూసేందుకు రాజమౌళి, తన భార్య నీలిమతో కలిసి మార్చి 5 అమెరికాకు వెళ్లాడు. అక్కడ కొడుకుతో కలిసి సరదాగా గడిపాడు. కొడుకుతో కలిసి అక్కడ పలు ప్రాంతాలను సందర్శించారు.

    వాషింగ్టన్, న్యూయార్క్‌ నగరాలను సందర్శిచారు. అనంతరం అంతా కలిసి కుమారుడి నివాసానికి తిరుగు పయనమయ్యారు. కారులో పవన్‌తో పాటు అతని తల్లిదండ్రులు, ఓ మిత్రుడు ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి వారు ప్రయాణిస్తున్న కారు.. పవన్ నివాసానికి రెండు మైళ్ల దూరంలో ఉండగా ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న నలుగురు సురక్షితం అని భావించారు. కానీ అంతలోనే మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

    ఉద్యోగం కోల్పోయి కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా మారాడు.. గంటకు రూ. 5 వేలు.. భార్య ల్యాప్‌ట్యాప్ ఓపెన్ చేయడంతో..

    తల్లిదండ్రులు అమ్మేశారు.. అత్తారింట్లో నెలల పాటు సాముహిక అత్యాచారం.. చివరకు ఓ రైల్లో..

    ప్రమాదం జరిగిన అనంతరం పవన్, అతడి మిత్రుడు కారు దిగి పరిశీలించారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పవన్‌కుమార్ కారు వెనక సీట్లలో కూర్చొన్న తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే తల్లి నీలిమ ప్రాణాలతో బయటపడగా, తండ్రి రాజమౌళి మంట్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ వార్త తెలిసి పరకాలలోని రాజమౌళి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకుతో సరదాగా గడిపేందుకు వెళ్లిన రాజమౌళికి ఇలా జరగడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు