హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gajwel: రేవంత్ నుంచి షర్మిల దాకా.. గజ్వేల్‌పైనే గురి.. సీఎం కేసీఆర్ నియోజకవర్గం వైపే అడుగులు ఎందుకంటే..

Gajwel: రేవంత్ నుంచి షర్మిల దాకా.. గజ్వేల్‌పైనే గురి.. సీఎం కేసీఆర్ నియోజకవర్గం వైపే అడుగులు ఎందుకంటే..

రేవంత్ రెడ్డి, షర్మిల (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, షర్మిల (ఫైల్ ఫోటో)

గజ్వేల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ ఇలాకాలో ప్రతిపక్షాల రాజకీయం జోరందుకుంది. సీఎం నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలతో సహా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు కూడా భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు వంటి పథకాలను తెరపైకి తీసుకొచ్చారన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి.

ఇంకా చదవండి ...

గజ్వేల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ఆయన ఇలాకాలో ప్రతిపక్షాల రాజకీయం జోరందుకుంది. సీఎం నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలతో సహా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు కూడా భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు వంటి పథకాలను తెరపైకి తీసుకొచ్చారన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ ప్రచారాన్ని గజ్వేల్ నియోజకవర్గం నుంచే మొదలుపెట్టాలని భావిస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా పురుడు పోసుకున్న పార్టీ వైఎస్‌ఆర్‌టీపీ. ఈ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మంగళవారం నాడు గజ్వేల్‌లో దీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ మండల పరిధిలోని అనంత రావుపల్లిలో కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తుంది.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గజ్వేల్‌లో సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. అధికార పార్టీ వాళ్లు అడ్డుకోవడానికి వస్తే.. వారిని తొక్కుకుంటూనైనా పోయి గజ్వేల్‌లో సభ నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించనుందన్న విషయాన్ని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని భావిస్తున్న ఈ సభకు గజ్వేల్‌లోని తూప్రాన్ రోడ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఇప్పటికే పరిశీలించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందన్న వాదనను సీఎం నియోజకవర్గం నుంచి బలంగా వినిపించాలని టీ.కాంగ్రెస్ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: YS Vijayamma: వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..? వైఎస్ హయాంలో మంత్రులకు విజయమ్మ ప్రత్యేక ఆహ్వానం

కాంగ్రెస్ నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రేపు జరిగే వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష విజయవంతం అవుతుందా లేక కార్యకర్తలు లేక ఉసూరుమంటుందా అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. జిల్లా పోలీసు యంత్రాంగం ఈ దీక్షకు ఇప్పటికైతే ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. వైఎస్ షర్మిల దీక్షకు అనుమతి లభించే అవకాశాలున్నట్లు తెలిసింది.

First published:

Tags: CM KCR, Gajwel, Revanth Reddy, Telangana updates, YS Sharmila

ఉత్తమ కథలు