తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వృద్ధాప్య పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. వృద్దాప్య పెన్షన్ వయోపరిమితిని తెలంగాణ సర్కార్(Telangana Government) 57 ఏళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే . 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు స్వీకరించనున్నారు.. సోమవారం (అక్టోబర్ 11) నుంచి ఈ నెలాఖరు వరకు వృద్దాప్య పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆసరా పెన్షన్ల లో భాగంగా 57 ఏళ్లకు తగ్గించిన వయోపరిమితి మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 31తో 57 ఏళ్లు నిండిన వారంతా వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు.
అర్హులు..
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు వృద్దాప్య పెన్షన్ పొందేందుకు అర్హులు. జనన ధ్రువీకరణ పత్రము లేదా ఆధార్ కార్డు లేదా వయస్సుని సూచించే ఏదైనా ఇతర పత్రములు ధరఖాస్తుకు అవసరమవుతాయి. వాటి ఆధారంగా వయసును నిర్దారిస్తారు. దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్ రాదు.
డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు ఆసరా పెన్షన్‌కు అనర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరా పెన్షన్లు ఇవ్వరు. అంతేకాదు .. తమ పేరిట హెవీ వెహికిల్స్ ఉన్నా, ఐటీ రిటర్నులు దాఖలు చేసినా పెన్షన్ పథకం వర్తంచదు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు. 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు కలిగిన వారికే పెన్షన్ ఇస్తారు.
కూలీ తలపై పడిన అరటిపండ్లు.. రూ. 4 కోట్ల పరిహారం చెల్లించమని చెప్పిన కోర్టు!.. ఇంతకీ ఏం జరిగిందంటే..
విచారణ సమయంలో ఇవన్నీ చూశాకే అర్హులను గుర్తిస్తారు. ఆ తర్వాతే పింఛను మంజూరవుతుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఈ నెల 11 నుంచి మీ సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్, ఓటర్ కార్డులతో పాటుగా, బ్యాంకు పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు మీసేవ సెంటర్‌కు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం (Aasara pension) పేరుతో వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు.. పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.2,116 పెన్షన్ ఇస్తున్నారు. అదే దివ్యాంగులకు రూ.3,116 ను అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara Pension Scheme, Telangana