Home /News /telangana /

Telangana: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీసీ కమిషన్ చైర్మన్‌గా ఆ నేత.. మళ్లీ హుజూరాబాద్‌కే ఛాన్స్

Telangana: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీసీ కమిషన్ చైర్మన్‌గా ఆ నేత.. మళ్లీ హుజూరాబాద్‌కే ఛాన్స్

సీఎం కేసీఆర్‌తో వకుళాభరణం కృష్ణమోహన్

సీఎం కేసీఆర్‌తో వకుళాభరణం కృష్ణమోహన్

Vakulabharanam Krishna Mohan: ప్రస్తుత పరిస్థితుల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్‌ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్ గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేశారు. ఇక కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రద్ పాటిల్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్‌ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    మాజీమంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులకు పలు కీలక పదవులు దక్కాయి. ఆ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత బండా శ్రీనివాస్‌ను తెలంగాణ ప్రభుత్వం
    రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించింది. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ అంశాన్ని గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు.

    నేతలకు పదవులు మాత్రమే కాదు.. కీలక పథకాలను కూడా హుజూరాబాద్ నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ కోసం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు విడుదల చేశారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్‌ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించడంతో.. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న నేతలకు ఎలాంటి పదవులు దక్కుతాయో అనే ఆసక్తి నెలకొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు