హోమ్ /వార్తలు /తెలంగాణ /

Government School: ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల..? ప్రత్యేకత ఏంటో తెలుసా?

Government School: ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల..? ప్రత్యేకత ఏంటో తెలుసా?

మెదక్ ప్రభుత్వ పాఠశాల

మెదక్ ప్రభుత్వ పాఠశాల

Government Shcool: అదొక ప్రభుత్వ పాఠశాల.. కానీ ప్రైవేటు స్కూల్ దీటుగా నడుస్తోంది. అక్కడ విద్యా బోధన కానీ.. సౌకర్యాలు కానీ చూస్తే షాక్ అవుతారు.. ఇంతకీ ఈ ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటి..?

కె.వీరన్న మెదక్ జిల్లా ప్రతినిధి, News 18..                             Government School:  ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.. చిన్న చిన్న గ్రామాల్లోనూ ప్రైవేటు స్కూళ్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పఠశాలలో తమ పిల్లలను చదివించడానికి ఇష్టపడరు. కానీ అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ఆ ప్రభుత్వ పాఠశాలకే పంపాలి అనుకుంటున్నారు.  వేలకు వేలు ఖర్చు చేసే ఆ ప్రైవేటు స్కూల్స్ కు పంపడం కన్నా.. ఈ ప్రభుత్వ పఠశాలలో చదివించడం ఎంతో మంచింది అని అభిప్రాయపడుతున్నారు ఆ గ్రామస్తులంతా. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల  ఇలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ప్రైవేట్ స్కూల్  ఉండే మాదిరిగా.. గోడలపై పాఠ్య పుస్తకం లో ఉన్న పద్యాలు, ఆల్ఫాబెటికల్ రకరకాల బొమ్మలతో పాటు ప్లవర్స్.. టేబుల్స్  అన్ని కొత్తగా తయారు చేసి.. అందంగా కనిపించేలా తీర్చి దిద్దారు ఆ పాఠశాలను. అలాగే బోధనలో కొత్త కొత్త విధానాలను ప్రవేశ పెడుతున్నారు.  సైదాపూర్ గ్రామ పాఠశాల లో మొత్తం 87మంది విద్యార్థులు ఉన్నారు.

కరోన నేపథ్యం నిబంధనలు పాటిస్తున్నారు.  ప్రతి  విద్యార్థి మాస్కు  ధరించేలా చూస్తున్నారు. శానిటైజర్ ను 24 గంటలు స్కూళ్లో అందుబాటులో ఉంచుతున్నారు అక్కడ ఉపాధ్యాయులు. ఆ గ్రామం నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలకు విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ లకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలను చదివిస్తూ విద్యా బోధన తో పాటు పాఠశాలలో ఆకర్షించే విధంగా గోడలపై విద్యార్థులకు ఉపయోగపడేలా బొమ్మలు ఉండడంతో విద్యార్థులకు విద్యా బోధన బాగుంటుందని ఉపాధ్యాయుల ఆలోచించారు.

అందుకే ప్రైవేటు స్కూల్ కు దీటుగా గుర్తింపు తెచ్చుకుంది.  సైదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 87 మంది విద్యార్థులు చదువుతున్నారు.  ఉపాధ్యాయులు ఏడుగురు విధులు నిర్వహిస్తున్నారు అందులో ముగ్గురు డిప్రెషన్ మరో ఐదు మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు.

ప్రైవేట్ స్కూల్ లకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెబుతున్నారు హెడ్ మాస్టర్  జి శశికళ. తల్లిదండ్రులంతా ఇలా విద్యార్థులను స్కూల్ కు పంపడం ఎంతో సంతోషంగా ఉంది అంటున్నారు. తమ పాఠశాల లో చదవుతున్న విద్యార్థులకు ఎంతో భవిష్యత్ ఉండేలా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు చదువు తో పాటు ఆటలు, పాటలు ఇతర  యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. చాలామంది విద్యార్థులను రాష్ట్రస్థాయిలో క్రీడలకు పంపుతున్నామని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఏడుగురు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసమే విధులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. నేటి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగితే అదే తమకు గురు దక్షిణ అంటున్నారు.

First published:

Tags: Medak Dist, Schools, Telangana, Ts government

ఉత్తమ కథలు